SSB Constable Recruitment | పదో తరగతి అర్హతతో ఎస్ఎస్‌బీలో కానిస్టేబుల్ పోస్టులు..
SSB Constable Recruitment | కేంద్ర హోం మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేసే సశస్త్ర సీమా బల్ (SSB Constable Recruitment) కానిస్టేబుల్ ట్రేడ్స్‌మ్యాన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 827 పోస్టులను భర్తీ చేస్తున్నది.
SSB Constable Recruitment | త్రినేత్ర.న్యూస్: కేంద్ర హోం మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేసే సశస్త్ర సీమా బల్ (SSB Constable Recruitment) కానిస్టేబుల్ ట్రేడ్స్‌మ్యాన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 827 పోస్టులను భర్తీ చేస్తున్నది. పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తిచేసిన అర్హులు. ఏప్రిల్ 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, పీఈటీ, స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
పోస్టుల వారీగా వివరాలు..
కానిస్టేబుల్ (వెటర్నరీ)- 34
అర్హత: సైన్స్ మెయిన్ సబ్జెక్టుగా పదోతరగతి, పశువుల దవాఖానలో ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి. 18 నుంచి 27 ఏండ్ల మధ్య వయసు ఉండాలి.
డ్రైవర్ (పురుషులకు మాత్రమే)- 553
అర్హతలు: పదో తరగతి, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 27 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలి.
ఎంపిక: దీనిలో అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పీఈటీ, పీఎస్టీ, స్కిల్ టెస్టు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలతో ఉంటుంది.
పీఈటీ: పురుషులు 4.8 కిలోమీటర్ల పరుగును 24 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనిలో మహిళలు 2.4 కిలోమీటర్ల దూరాన్ని 18 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులను పీఎస్టీలో పాల్గొనేందుకు అవకాశమిస్తారు.
నర్సింగ్ ఆర్డర్లీ- 1
అర్హత: పదోతరగతి, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ కోర్సు, నర్సింగ్ ఆర్డర్లీగా సంవత్సరం ఉద్యోగానుభవం.
వయసు: దీనిలో అర్హత సాధించేందుకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
సీబీటీ: పీఎస్టీలో అర్హత పొందినవారికి రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) ఉంటుంది. దీనిలో రెండు గంటల వ్యవధి ఉంటుంది. మల్డిపుల్ ఛాయిస్ విధానంలో 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. దీనిలో మ్యాథమెటిక్స్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లిష్ / హిందీల అంశాల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో జనరల్ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ, ఎస్టీలైతే 45 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. వీరిని 1:20 నిష్పత్తిలో కేటగిరీల వారీ ధ్రువపత్రాల పరిశీలన, స్కిల్ టెస్టులకు ఎంపిక చేస్తారు.
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST): పోస్టును అనుసరించి శారీరక కొలతల్లో తేడాలు ఉంటాయి.
వాటర్ క్యారియర్, టైటర్, బార్బర్, గార్డెనర్, కోబ్లర్, వాషర్‌మ్యాన్, వెయిటర్, కార్పెంటర్- 239
అర్హత: పదోతరగతి / తత్సమానం ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత రంగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి. సంబంధిత ట్రేడులో సంవత్సరం వ్యవధి ఉన్న ఐటీఐ సర్టిఫికెట్, రెండు సంవత్సరాల డిప్లొమా ఉండాలి. ట్రేడ్ టెస్టులో తప్పనిసరిగా అర్హత సాధించాలి. 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయసువారై ఉండాలి.
స్కిల్ టెస్ట్: అన్ని పోస్టులకూ ఈ పరీక్షను 50 మార్కులకు నిర్వహిస్తారు. అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించాలి. అయితే వైద్య పరీక్షల తర్వాత మాత్రమే కేటగిరీల వారీగా తుది ఎంపిక నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.100, మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్లకు చివరి తేదీ: ఏప్రిల్ 20
వెబ్సైట్: https://ssb.gov.in/
పూర్తి వివరాలకు..
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్




