త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SSB | స‌శ‌స్త్ర సీమాబ‌ల్‌లో స్పోర్ట్స్ కోటా కానిస్టేబుల్ పోస్టులు..

SSB | కేంద్ర హోం మంత్రిత్వ‌శాఖ ఆధ్వ‌ర్యంలోని స‌శ‌స్త్ర సీమాబ‌ల్ (SSB) స్పోర్ట్స్ కోటాలో (Sports Quota) కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్న‌ది. మొత్తం 404 పోస్టుల‌ను భ‌ర్తీ (SSB Recruitment) చేస్తున్న‌ది.

G

National | Published On May 10, 2026, 12.47 pm IST

SSB | స‌శ‌స్త్ర సీమాబ‌ల్‌లో స్పోర్ట్స్ కోటా కానిస్టేబుల్ పోస్టులు..
Advertisement

SSB | త్రినేత్ర‌.న్యూస్‌: కేంద్ర హోం మంత్రిత్వ‌శాఖ ఆధ్వ‌ర్యంలోని స‌శ‌స్త్ర సీమాబ‌ల్ (SSB) స్పోర్ట్స్ కోటాలో (Sports Quota) కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్న‌ది. మొత్తం 404 పోస్టుల‌ను భ‌ర్తీ (SSB Recruitment) చేస్తున్న‌ది. మ‌హిళ‌లు కూడా అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అర్హులే. జూన్ 7 వ‌ర‌కు ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు అందుబాటులో ఉన్నాయి.

మొత్తం ఖాళీలు- 404
ఆర్చ‌రీ- 14, అథ్లెటిక్స్ 42, ఆక్వాటిక్స్ 14, బాక్సింగ్ 18, బాస్కెట్ బాల్ 21, బ్యాడ్మింట‌న్ 6, సైక్లింగ్ 4, ఈక్వెస్ట్రియ‌న్ 5, ఫేన్సింగ్ 10, ఫుట్‌బాల్ 22, జిమ్నాస్టిక్స్ 4, హాకీ 28, హాండ్‌బాల్ 16, జూడో 12, క‌బ‌డ్డి 12, క‌రాటే 14, క‌యాకింగ్ అండ్ కెనోయింగ్ 27, పెన్కాక్ సిలాట్ 16, ప‌వ‌ర్ లిఫ్టింగ్ 4, రోయింగ్ 13, షూటింగ్ 4, టేబుల్ టెన్నిస్ 6, టైక్వాండో 16, వాలీబాల్ 14, రెజ్లింగ్ 27, ఉషు 16, వెయిట్ లిఫ్టింగ్ 13, యోగ‌సాన 6 చొప్పున పోస్టులు ఉన్నాయి.

అర్హ‌తలు
మెట్రిక్యులేష‌న్ పూర్తి చేయాలి. సంబంధి క్రీడ‌లో జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో పాల్గొని ప‌థ‌కం గెలుపొంది ఉండాలి. అభ్య‌ర్థులు 18 నుంచి 23 ఏండ్ల లోపువారై ఉండాలి. పురుషులు 170 సెం.మీ. పొడ‌వు, ఛాతీ 80-85 సెం.మీ. ఉండాలి. మ‌హిళ‌లు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి.

ఎంపిక విధానం
రెండు విధాలుగా ఉంటుంది. మొద‌టి ద‌శ‌లో జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో ప‌థ‌కాలు గెలుపొందిన‌వారికి ప్ర‌ధాన్య‌త ఉంటుంది. రెండో ద‌శ‌లో మిగిలిన పోస్టుల‌కు మిగిలిన‌వారిని తీసుకుంటారు. డాక్యుమెంట్ వెరిఫికేష‌న్‌, ఫిజిక‌ల్ టెస్ట్‌, డీటెయిల్డ్ మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్ నిర్వ‌హిస్తారు.

ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్‌లో
ద‌ర‌ఖాస్తులకు చివ‌రితేదీ: జూన్ 7
వెబ్‌సైట్‌: https://www.recruitment.ssb.gov.in

 

Advertisement
Advertisement