Mother | 5 నెలలుగా.. కన్నతల్లిని గొలుసుతో బంధించిన కుమారుడు
Mother | సృష్టిలో అమ్మను (Mother) మించిన దైవం లేదంటారు. నవమాసాలు మోసి.. తన ప్రాణాలను పణంగా పెట్టి బిడ్డను కంటుంది అమ్మ. ఎన్ని బాధలను ఓర్చుకోనైనా తన పిల్లలను పెంచుతుంది. అలాంటి అమ్మను ఓ కోడుకు.. గొలుసుతో కట్టేశాడు. వృద్ధాప్యంలో ఉన్న ఆమెను ఐదు నెలలుగా ఓ చిన్న గుడిసెలో కట్టిపడేశాడు.
Mother | త్రినేత్ర.న్యూస్: సృష్టిలో అమ్మను (Mother) మించిన దైవం లేదంటారు. నవమాసాలు మోసి.. తన ప్రాణాలను పణంగా పెట్టి బిడ్డను కంటుంది అమ్మ. ఎన్ని బాధలను ఓర్చుకోనైనా తన పిల్లలను పెంచుతుంది. అలాంటి అమ్మను ఓ కోడుకు.. గొలుసుతో కట్టేశాడు. వృద్ధాప్యంలో ఉన్న ఆమెను ఐదు నెలలుగా ఓ చిన్న గుడిసెలో కట్టిపడేశాడు. తన కడుపు మాడ్చుకొనైనా.. పిల్లలకు తిండిపెట్టే ఆ తల్లిని.. తాగడానికి నీరు, ఆహారం కూడా సరిగా పెట్టలేదు ఆ కర్కష కుమారుడు. ఈ ఘటన తమిళనాడులోని (Tamil Nadu) నామక్కల్ జిల్లా వెప్పడైలో చోటుచేసుకున్నది.
వెప్పడై సమీపంలోని చవుదాపురానికి చెందిన రంగసామి, పళనియమ్మాల్ దంపతులకు ఇద్దరు కుమారులు తంగవేల్, షణ్ముగం ఉన్నారు. చాలా ఏండ్ల క్రితం భర్తతో విడిపోయిన పళనియమ్మాల్ పెద్ద కుమారుడు తంగవేల్ దగ్గర ఉంటున్నది. చిన్న కొడుకు షణ్ముగం గత 25ఏండ్లుగా కుటుంబంతో కోవైలో ఉంటున్నారు. సాధారణంగా అందరు అన్నదమ్ముల్లానే.. ఈ ఇద్దరు సోదరుల మధ్య ఆస్తి తగాదాలున్నాయి. దీంతో తంగవేల్, షణ్ముగం మధ్య సంబంధాలు అంతంతమాత్రమే. కాగా, గత కొంతకాలంగా మతిమరుపుతో బాధపడుతున్న పళనియమ్మాల్.. తరచూ ఇంట్లోంచి బయటకు వెళ్తున్నది. దీంతో ఎక్కడికీ పోకుండా గత 5 నెలలుగా ఊరుచిర్లోని చిన్న గుడిసెలో ఆమెను ఇనుప గొలుసుతో బంధించారు. నీరు, ఆహారం కూడా సరిగ్గా ఇవ్వడం లేదు.
విషయం తెలియడంతో చవుదాపురం వచ్చిన చిన్న కుమారుడు షణ్ముగం గొలుసుతో బంధించి ఉన్న తల్లిని విడిపించారు. పళనియమ్మాల్‌ను చిన్న కొడుకు తన వెంట తీసుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేడయంతో తంగవేల్‌ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

Vijay TVK cabinet 2026 | సీఎం విజయ్ ‘క్యాబినెట్ ఆఫ్ ఫస్ట్స్’: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం.. దళపతి మాస్టర్ మైండ్
మే 21, 2026

MK Stalin | విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలి.. పార్టీ శ్రేణులకు స్టాలిన్ పిలుపు
మే 19, 2026

MK Stalin | పేరు ప్రస్తావించకుండానే.. విజయ్‌పై విమర్శల దాడిని ప్రారంభించిన స్టాలిన్..!
మే 18, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



