Sharjeel Imam | ఢిల్లీ అల్లర్ల కేసు.. శర్జీల్ ఇమామ్‌కు మధ్యంతర బెయిల్..!
Sharjeel Imam | ఢిల్లీ అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శర్జీల్ ఇమామ్‌కు కర్కర్దూమా కోర్టు సోమవారం భారీ ఊరటనిచ్చింది. కోర్టు పదిరోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Sharjeel Imam | ఢిల్లీ అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శర్జీల్ ఇమామ్‌కు కర్కర్దూమా కోర్టు సోమవారం భారీ ఊరటనిచ్చింది. కోర్టు పదిరోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సోదరి పెళ్లికి హాజరయ్యేందుకు, అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని చూసుకునేందుకు న్యాయమూర్తి సమీర్ బజ్‌పాయ్ మార్చి 20 నుంచి 30 వరకు మధ్యంతర బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శర్జీల్ ఇమామ్ కుటుంబ పరిస్థితుల దృష్టిలో పెట్టుకొని పది రోజులు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. త్వరలోనే అతని సోదరి పెళ్లి జరుగబోతుందని, కుటుంబ సభ్యులు హాజరుకావాల్సి ఉంటుందని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అలాగే, తల్లి చాలాకాలంగా ఆరోగ్యంతో బాధపడుతుందని, ఆమెను చూసుకునేందుకు ఎవరూ లేరని పేర్కొన్నారు. పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మానవీయ కోణంలో శర్జీల్ ఇమామ్‌కు పదిరోజులు బెయిల్ మంజూరు చేసింది.
సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (CAA), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్సీ (NRC)కి వ్యతిరేకంగా ఢిల్లీ తూర్పు-ఉత్తర ప్రాంతాల్లో నిరసనలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ హింసలో 53 మంది మృతి చెందారు. ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ సైతం హత్యకు గురయ్యారు. ఈ అల్లర్లకు సంబంధించి 15 మందిని నిందితులుగా పేర్కొంటూ చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం (ఉపా) కింద చార్జిషీట్ దాఖలైంది. ఇందులో కొందరికి బెయిల్ మంజూరైంది. ఉమర్ ఖాలిద్, శర్జీల్ ఇమామ్ సహా పలువురికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సర్వోన్నత న్యాయస్థానం పలువురికి బెయిల్ ఇవ్వగా.. ఖలిద్, ఇమామ్‌కు బెయిల్ నిరాకరించింది.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






