SAIL Apprentices | సెయిల్‌లో 710 అప్రెంటిస్‌లు.. రాతపరీక్ష లేకుండానే..
SAIL Apprentices | భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో (Bhilai Steel Plant) అప్రెంటిస్‌ల నియామకాలు చేపడుతున్నది. వివిధ విభాగాల్లో మొత్తం 710 ట్రేడ్, డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (SAIL Apprentices) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
SAIL Apprentices | త్రినేత్ర న్యూస్: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో (Bhilai Steel Plant) అప్రెంటిస్‌ల నియామకాలు చేపడుతున్నది. వివిధ విభాగాల్లో మొత్తం 710 ట్రేడ్, డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (SAIL Apprentices) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాతపరీక్ష లేకుండానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఏడాది పాటు శిక్షణ ఇస్తారు.
మొత్తం సీట్లు: 710
ట్రేడ్ అప్రెంటిస్ (ITI)- 516 ఖాళీలు
ఎలక్ట్రీషియన్ 95, ఫిట్టర్ 80, మల్టీమీడియా అండ్ యానిమేషన్ స్పెషల్ ఎఫెక్ట్స్ 9, టెక్నీషియన్ మెకాట్రానిక్స్ 20, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 20, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ 25, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ 35, మెషినిస్ట్ 25, మెకానిక్ రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ 20, టర్నర్ 15, వెల్డర్ 15, ఐసీటీఎస్‌ఎం (ICTSM) 15, ఏఓసీపీ (AOCP) 15, డీజిల్ మెకానిక్ 15, టూల్ అండ్ డై మేకర్ 10, ఎల్‌ఏసీపీ 10, మెకానిక్ మోటార్ వెహికల్ 10, ఉడ్ వర్క్ టెక్నీషియన్ 10, స్టెనోగ్రాఫర్ అండ్ సెక్రటేరియల్ అసిస్టెంట్ 20 తదితరాలు..
డిప్లొమా అప్రెంటిస్- 124 ఖాళీలు
సెరామిక్ టెక్నాలజీ 2, కెమికల్ 2, సివిల్ 10, కంప్యూటర్ సైన్స్ 5, ట్రిపుల్‌ఈ 5, ఎలక్ట్రికల్ 10, మెకానికల్ 10, మెటలర్జీ 20, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ 10, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 5, ఆటోమొబైల్ 5, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 8, డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ (DP) 5, డిప్లొమా ఇన్ నర్సింగ్ (GNM) 5, డిప్లొమా ఇన్ ఫార్మసీ (D.Pharma) 5, డీఎంఎల్‌టీ 5, డీఆర్‌టీ 5, డీఎక్స్‌టీ 5, డీఓటీటీ 2, డీ.ఫార్మా 5 చొప్పున ఉన్నాయి.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్- 70 ఖాళీలు
సెరామిక్ టెక్నాలజీ 2, కెమికల్ 2, సివిల్ 5, కంప్యూటర్ సైన్స్ 2, ట్రిపుల్‌ఈ 2, ఎలక్ట్రికల్ 2, మెకానికల్ 2, మెటలర్జీ 5, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ 2, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2, ఆటోమొబైల్ 2, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 2, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ 5, ప్రొడక్షన్ 5, బ్యాచిలర్ ఇన్ ఆర్ట్స్ (BA) 5, బ్యాచిలర్ ఇన్ సైన్స్ (B.Sc) 3, డీకామ్ 5, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (BCA) 5, బీబీఏ 5, బీఎస్సీ నర్సింగ్ 5, డాటా ఎంట్రీ ఆపరేటర్ 2 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత విభాగం ట్రేడుల్లో ఐటీఐ, డిప్లొమా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. గత ఐదు సంవత్సరాలలో (2022, 2023, 2024, 2025, 2026) ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు, లేదా ఇప్పటికే అప్రెంటిస్ శిక్షణ పూర్తి చేసిన లేదా చేస్తున్నవారు, అలాగే ఏడాది అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. అభ్యర్థులు 2026 అక్టోబర్ 31 నాటికి 18 ఏండ్లు నిండినవారై ఉండాలి.
ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా జరుగుతుంది (పదో తరగతి మార్కులకు 30 శాతం, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ మార్కులకు 70 శాతం వెయిటేజీ ఇస్తారు). ఎంపికైన వారికి ట్రేడ్ అప్రెంటిస్‌కు రూ.9,600, డిప్లొమా అప్రెంటిస్ రూ.10,900, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ రూ.12,300 చొప్పున ప్రతినెల స్టైపెండ్ అందిస్తారు. ఇంటర్వ్యూలు రూమ్ నంబర్ 123, హెచ్‌ఆర్‌డీసీ భిలాయ్ స్టీల్ ప్లాంట్, ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతాయి.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో. మొదట https://apprenticeshipindia.org పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుని, దరఖాస్తు చేసుకోవాలి. గ్రాడ్యుయేట్, డిప్లొమా అభ్యర్థులు [https://nats.education.gov.in](https://nats.education.gov.in) (NATS) పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుని, అప్లై చేయాలి. ఆ తర్వాత కేటాయించిన షెడ్యూల్ ప్రకారం వాక్-ఇన్ ప్రక్రియకు హాజరుకావాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 20
ఇంటర్వూ తేదీలు: అక్టోబర్ 27 నుంచి నవంబర్ 21 వరకు
వెబ్‌సైట్: https://nats.education.gov.in/, https://www.apprenticeshipindia.gov.in/
సంబంధిత వార్తలు

Canara Bank Recruitment | కెనరా బ్యాంకులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు.. తెలంగాణలో 134, ఏపీలో 247 ఖాళీలు
సెప్టెంబర్ 29, 2026

Ex Dividend Stocks | డివిడెండ్ అలర్ట్.. ఏయే షేర్లకు ఇస్తున్నారంటే..
సెప్టెంబర్ 28, 2026

RRB NTPC | భారతీయ రైల్వేలో 5165 నాన్‌టెక్నికల్ ఉద్యోగాలు.. RRB ఎన్టీపీసీ నోటిఫికేషన్ విడుదల
సెప్టెంబర్ 25, 2026
తాజావార్తలు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో నష్టాల పరంపర.. భారీ స్థాయిలో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు..
- ●Captain Smit Machchhar | అతడు ఒక హీరో.. కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను కొనియాడిన ప్రధాని మోదీ
- ●Gas Cylinder Price | భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..
- ●University Men's Hostel | యూత్ కాంగ్రెస్, ఎస్ఎఫ్ఐ ఘర్షణ.. రణరంగంగా యూనివర్సిటీ మెన్స్ హాస్టల్
- ●Gandhi Jayanti | డ్రైడే.. రేపు మాంసం, మద్యం దుకాణాలు బంద్..
- ●Horoscope | అక్టోబర్ 1 రాశిఫలాలు.. గురుడి అనుగ్రహంతో మానసిక ఆందోళనల నుంచి ఉపశమనం!

Stock Markets | స్టాక్ మార్కెట్లలో నష్టాల పరంపర.. భారీ స్థాయిలో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు..

Captain Smit Machchhar | అతడు ఒక హీరో.. కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను కొనియాడిన ప్రధాని మోదీ

Gas Cylinder Price | భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..

University Men's Hostel | యూత్ కాంగ్రెస్, ఎస్ఎఫ్ఐ ఘర్షణ.. రణరంగంగా యూనివర్సిటీ మెన్స్ హాస్టల్



