Ratna Debnath | పానిహటిలో ఆర్జీ కర్ ఆసుపత్రి బాధితురాలి తల్లి ముందంజ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కర్ ఆసుపత్రి బాధితురాలి తల్లి, బీజేపీ అభ్యర్థి రత్నా దేబ్‌నాథ్ పానిహటి స్థానంలో ముందంజలో కొనసాగుతున్నారు.
Ratna Debnath | త్రినేత్ర.న్యూస్ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈ టైమ్‌లో పలు కీలక నియోజకవర్గాల ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రి అత్యాచారం, హత్య ఘటన బాధితురాలి తల్లి రత్నా దేబ్‌నాథ్ ఎన్నికల బరిలో నిలిచి సత్తా చాటుతున్నారు. పానిహటి అసెంబ్లీ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె.. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం ముందంజలో ఉన్నారు.
అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అభ్యర్థి తీర్థంకర్ ఘోష్ ఈ స్థానంలో వెనుకంజలో ఉన్నారు. ఈరోజు ఉదయం లెక్కింపు ప్రారంభమైనప్పుడు తీర్థంకర్ ఘోష్ ఆధిక్యం కనబరిచినప్పటికీ.. క్రమంగా రత్నా దేబ్‌నాథ్ పుంజుకుని ఆయనను వెనక్కి నెట్టారు.

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలను, అధికార మమతా బెనర్జీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాన అస్త్రంగా చేసుకుని రత్నా దేబ్‌నాథ్ ఎన్నికల ప్రచారంలోకి దిగారు. ఆర్జీ కర్ ఆసుపత్రి ప్రాంగణంలో యువ వైద్యురాలి దారుణ హత్య రాష్ట్రవ్యాప్తంగా ఎంతటి ఆగ్రహజ్వాలలు రగిలించిందో తెలిసిందే. ఆ తర్వాత జరిగిన నిరసనలపై ఒత్తిళ్లు, బదిలీలు వంటి చర్యలు తీసుకున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. వీటిపై కలకత్తా హైకోర్టులోనూ సవాళ్లు ఎదురయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మహిళల భద్రత, ప్రభుత్వ సంస్థల సమగ్రతపై ఆమె లేవనెత్తిన ప్రశ్నలు ఓటర్లను విశేషంగా ఆకర్షించినట్లు తెలుస్తోంది.
మరోవైపు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో బీజేపీ ప్రభంజనం సృష్టిస్తోంది. బెంగాల్‌లో తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఆ పార్టీ చారిత్రక అడుగులు వేస్తోంది. తాజా సమాచారం ప్రకారం బీజేపీ ఏకంగా 191 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, అధికార తృణమూల్ కాంగ్రెస్ 99 స్థానాలకే పరిమితమై తీవ్ర వెనుకంజలో ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






