త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Women Chief Ministers | మ‌హిళ‌కు గ్ర‌హ‌ణం.. మ‌మ‌త ఓట‌మితో మిగిలింది ఒక్క‌రే..!

ఆకాశంలో స‌గ భాగ‌మైన మ‌హిళ‌లు.. ఆర్థిక‌, సామాజికంగా ఎద‌గ‌డంతో పాటు చ‌ట్ట‌స‌భ‌ల్లోకి అడుగుపెట్టాల‌ని అన్ని రాజకీయ పార్టీలు ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు మోగిస్తూనే ఉంటాయి. పురుషుల‌తో స‌మానంగా హ‌క్కులు క‌ల్పించాల‌ని, రాజ‌కీయంగా అత్యంత ప్రాధాన్య‌త క‌ల్పించాల‌ని ప్ర‌సంగాలు చేస్తూనే ఉంటారు. అంతేందుకు.. నిన్న‌గాక మొన్న పార్లమెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టిన మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు ఓడిపోయింది. ఆ బిల్లు వీగిపోయిందో లేదో.. క‌మ్యూనిస్టుల కంచుకోట‌ను బ‌ద్ద‌లుకొట్టి.. మూడుసార్లు సీఎంగా ప‌నిచేసిన మ‌మ‌తా బెన‌ర్జీ ఓట‌మి చ‌విచూసింది. దీంతో దేశంలో ప్ర‌స్తుతం ఒకే ఒక్క ఏకైక మ‌హిళా సీఎం ఉన్నారు. ఆమె ఎవ‌రో కాదు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా.

G

National | Published On May 4, 2026, 4.09 pm IST

Women Chief Ministers | మ‌హిళ‌కు గ్ర‌హ‌ణం.. మ‌మ‌త ఓట‌మితో మిగిలింది ఒక్క‌రే..!
Advertisement
  • ముఖ్య‌మంత్రులుగా ప‌నిచేసిన 18 మంది మ‌హిళ‌లు..
  • తొలి మ‌హిళా సీఎం సుచేత కృప‌లాని
  • అత్య‌ధికాలం సీఎంగా షీలా దీక్షిత్‌
  • బెంగాల్‌లో అధికారం కోల్పోయిన మ‌మ‌తా బెన‌ర్జీ

Women Chief Ministers | త్రినేత్ర‌.న్యూస్‌: దేశంలో అన్ని రంగాల‌తోపాటు రాజ‌కీయాల్లోనూ మ‌హిళ‌లు రాణిస్తున్నారు. స్థానిక సంస్థ‌లో 50 శాతం ప‌ద‌వుల‌ను మ‌హిళామ‌ణులే చేప‌ట్టారు. చ‌ట్ట‌స‌భ‌ల్లోనూ రోజురోజుకి వారి సంఖ్య పెరుగుతూ వ‌స్తున్న‌ది. ప్ర‌స్తుత లోక్‌స‌భ‌లో 74 మంది మ‌హిళా ఎంపీలు ఉన్నారు. దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో క‌లిపి 400 నుంచి 464 మంది మ‌హిళా ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. కానీ మ‌హిళా ముఖ్య‌మంత్రుల (Women Chief Ministers) సంఖ్య మాత్రం ఒక‌టికి ప‌డిపోయింది. ఇప్ప‌టివ‌ర‌కు ఢిల్లీ, ప‌శ్చిమ బెంగాల్‌లో మ‌హిళ‌లు ముఖ్య‌మంత్రులుగా ఉన్నారు. అయితే తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో మ‌మ‌తా బెన‌ర్జీ నేతృత్వంలోని టీఎంసీ అధికారం కోల్పోయింది. దీంతో ఢిల్లీ ముఖ్య‌మంత్రి రేఖా గుప్తా మాత్ర‌మే మిగిలిపోయి.. ఏకైక మ‌హిళా సీఎంగా నిలిచారు.

అయితే దేశంలోని 20కిపైగా రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత‌ ప్రాంతాల్లో బీజేపీ అధికారంలో ఉన్న‌ది. అయితే ఒక్క‌రు మాత్రమే మ‌హిళా సీఎం ఉన్నారు. ఇక విప‌క్ష పార్టీలు అధికారంలో ఉన్న క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, కేర‌ళ, జార్ఖండ్‌, జ‌మ్ముక‌శ్మీర్‌, పంజాబ్‌లో పురుషులే సీఎం పీఠంపై ఉన్నారు. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో అసోం, ప‌శ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ.. ఆ రాష్ట్రాల్లో మ‌హిళ‌లు సీఎం ప‌ద‌విని ద‌క్కించుకోవ‌డం అసాధ్య‌మే.

18 మంది మ‌హిళ‌లు

కాగా, దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 18 మంది మ‌హిళ‌లు వివిధ రాష్ట్రాల‌కు ముఖ్య‌మంత్రులుగా ప‌నిచేశారు. 1963లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎంగా సుచేతా కృప‌లానీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. దీంతో దేశంలో తొలి మ‌హిళా ముఖ్య‌మంత్రిగా ఆమె రికార్డుల్లోకెక్కారు. అత్య‌ధిక కాలం ప‌నిచేసి మ‌హిళా సీఎం షీలా దీక్షిత్ (ఢిల్లీ) చ‌రిత్ర‌లో నిలిచారు. ఆమె 15 ఏండ్ల‌కుపైగా ఢిల్లీని పాలించారు. ఇక బెంగాల్‌ తాజా మాజీ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ కూడా.. ప‌దిహేను ఏండ్ల‌ పాటు సీఎం కొన‌సాగారు. తమిళనాడుకు సీఎంగా వీఎన్. జానకి రామచంద్రన్ కేవ‌లం 23 రోజులే ప‌నిచేశారు. దీంతో అత్యల్ప కాలం సీఎం కొన‌సాగిన మ‌హిళ‌గా ఆమె నిలిచారు. అల‌నాటి న‌టి జ‌య‌ల‌లిత త‌మిళ‌నాడుకు ఐదు ప‌ర్యాయాలు సీఎంగా సేవ‌లందించారు. రాజ‌స్థాన్ సీఎంగా వ‌సుంధ‌ర రాజే రెండు ప‌ర్యాయాలు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు.

ఆకాశంలో స‌గ భాగ‌మైన మ‌హిళ‌లు.. ఆర్థిక‌, సామాజికంగా ఎద‌గ‌డంతో పాటు చ‌ట్ట‌స‌భ‌ల్లోకి అడుగుపెట్టాల‌ని అన్ని రాజకీయ పార్టీలు ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు మోగిస్తూనే ఉంటాయి. అంతేకాదు.. వారికి పురుషుల‌తో స‌మానంగా హ‌క్కులు క‌ల్పించాల‌ని, రాజ‌కీయంగా అత్యంత ప్రాధాన్య‌త క‌ల్పించాల‌ని ప్ర‌సంగాలు చేస్తూనే ఉంటారు. అంతేందుకు.. నిన్న‌గాక మొన్న పార్లమెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టిన మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు ఓడిపోయింది. ఆ బిల్లు వీగిపోయిందో లేదో.. క‌మ్యూనిస్టుల కంచుకోట‌ను బ‌ద్ద‌లుకొట్టి.. మూడు ప‌ర్యాయాలు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన ఆడ పులి మ‌మ‌తా బెన‌ర్జీ ఓట‌మి చ‌విచూసింది. నాలుగోసారి సైతం తృణ‌మూల్ కాంగ్రెస్ గెలిచి ఆమె సీఎంగా ప‌గ్గాలు చేప‌ట్టి చ‌రిత్ర సృష్టిస్తార‌ని ఊహించిన ఈ దేశ ప్ర‌జ‌ల‌కు షాక్ త‌గిలింది. ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బ‌డి గొంతెత్తున్న మ‌మ‌తా అధికారం కోల్పోవ‌డంతో.. ఈ దేశంలో మ‌హిళ‌కు గ్ర‌హ‌ణం ప‌ట్టింద‌ని మ‌హిళా రాజ‌కీయ నాయ‌కురాళ్లు, విశ్లేష‌కులు త‌మ అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. ఈ దేశంలో ప్ర‌స్తుతం ఒకే ఒక్క ఏకైక మ‌హిళా సీఎం ఉన్నారు. ఆమె ఎవ‌రో కాదు దేశ రాజ‌ధాని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా.

మ‌హిళా ముఖ్య‌మంత్రులు..

  • సుచేతా కృపలానీ- ఉత్తరప్రదేశ్ (తొలి మహిళా సీఎం)
  • మమతా బెనర్జీ- పశ్చిమ బెంగాల్
  • జయలలిత- తమిళనాడు
  • మాయావతి- ఉత్తరప్రదేశ్
  • శీలా దీక్షిత్- ఢిల్లీ
  • వసుంధర రాజే సింధియా- రాజస్థాన్
  • ఉమా భారతి- మధ్యప్రదేశ్
  • ర‌బ్రీ దేవి- బీహార్‌
  • నందిని సత్పతి- ఒడిశా
  • మెహబూబా ముఫ్తీ- జమ్ముక‌శ్మీర్‌
  • ఆనందిబెన్ పటేల్- గుజరాత్
  • రాజీంద‌ర్ కౌర్ భట్టల్- పంజాబ్
  • శికళా కాకోద్కర్- గోవా
  • అన్వారా తైమూర్- అస్సాం
  • వీఎన్. జానకి రామచంద్రన్- తమిళనాడు
  • అతిషి- ఢిల్లీ
  • రేఖా గుప్తా- ఢిల్లీ
Advertisement
Advertisement