Ayodhya | రామ్‌లల్లా దర్శన వేళల్లో మార్పులు.. నవంబర్ 1 నుంచి కొత్త షెడ్యూల్!
Ayodhya | అయోధ్య రామమందిరంలో బాలరాముడి నిత్య పూజలు, హారతులు, నైవేద్యాలు, విశ్రాంతి, భక్తుల దర్శన వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కొత్త షెడ్యూల్‌ను రూపొందించింది. ఈ సవరించిన సమయాలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
Ayodhya | అయోధ్య రామమందిరంలో బాలరాముడి నిత్య పూజలు, హారతులు, నైవేద్యాలు, విశ్రాంతి, భక్తుల దర్శన వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కొత్త షెడ్యూల్‌ను రూపొందించింది. ఈ సవరించిన సమయాలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం తెల్లవారుజామున 3.45 గంటలకు తెరుచుకుంటున్న ఆలయ ద్వారాలు.. కొత్త షెడ్యూల్ ప్రకారం ఉదయం 4 గంటలకు తెరుచుకోనున్నాయి. రాత్రి 10.30 గంటలకు బదులుగా 10 గంటలకే మూసివేయనున్నారు. ఉదయం 7 గంటల నుంచి భక్తులకు రామ్‌లల్లా దర్శనం కల్పిస్తారు. మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల వరకు బాలరాముడికి విశ్రాంతి సమయం కేటాయించారు. ఇప్పటివరకు ఈ విరామం కేవలం అరగంట మాత్రమే ఉండేది.
కొత్త షెడ్యూల్ ఇదే..
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మీడియా సలహాదారు సుభాష్ చంద్ర సింగ్ ఈ మార్పులను వెల్లడించారు. ప్రధాన అర్చకుడు ఆచార్య కేశవ్ కొత్త దినచర్యను రూపొందించినట్లు తెలిపారు. ఈ మార్పులతో భక్తులు దర్శన సమయాలను ముందుగానే తెలుసుకుని అయోధ్య పర్యటనను ప్లాన్ చేసుకోవాలని ఆలయ వర్గాలు సూచిస్తున్నాయి.
ఉదయం 4 : ఆలయ ద్వారాల ప్రారంభం
ఉదయం 4.30 : మంగళ హారతి
ఉదయం 7: భక్తులకు దర్శనం ప్రారంభం
ఉదయం 8–8.10: బాలభోగం
మధ్యాహ్నం 12.30–1.30: రామ్‌లల్లాకు విశ్రాంతి
రాత్రి 9.15 : దర్శనాల ముగింపు
రాత్రి 9.30: శయన హారతి
రాత్రి 10: ఆలయ ద్వారాల మూసివేత.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Gold Rate | బంగారం కొనుగోలుదారులకు బిగ్ రిలీఫ్.. ఒకే రోజు రూ.3200 డౌన్.. అదే బాటలో వెండి
అక్టోబర్ 31, 2026

Regina Cassandra | రెజీనా అనూహ్య నిర్ణయం.. ఎన్జీవోకు గుడ్‌బై..!
అక్టోబర్ 31, 2026

Cyclone Threat | బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఇస్రో శాటిలైట్ చిత్రాల్లో స్పష్టంగా గుర్తింపు..
అక్టోబర్ 31, 2026
తాజావార్తలు
- ●Nashik Trimbakeshwar Simhastha Kumbh Mela 2027 | త్రయంబకేశ్వర్‌లో సింహస్థ కుంభమేళా 2027 ప్రారంభం: పవిత్ర ధర్మధ్వజ ఆవిష్కరణ.. ఆ చిహ్నాల పరమార్థమిదే!
- ●Gold Rate | బంగారం కొనుగోలుదారులకు బిగ్ రిలీఫ్.. ఒకే రోజు రూ.3200 డౌన్.. అదే బాటలో వెండి
- ●NMMSS Scholarship 2026 | విద్యార్థులకు అలర్ట్: కేంద్ర స్కాలర్షిప్ గడువు పెంపు.. ఏటా రూ.12,000 పొందే చాన్స్
- ●Serial Actress | లంగా ఓణీలో అగ్నిసాక్షి సీరియల్ హీరోయిన్ అందాలు అదుర్స్
- ●Regina Cassandra | రెజీనా అనూహ్య నిర్ణయం.. ఎన్జీవోకు గుడ్‌బై..!
- ●Cyclone Threat | బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఇస్రో శాటిలైట్ చిత్రాల్లో స్పష్టంగా గుర్తింపు..

Nashik Trimbakeshwar Simhastha Kumbh Mela 2027 | త్రయంబకేశ్వర్‌లో సింహస్థ కుంభమేళా 2027 ప్రారంభం: పవిత్ర ధర్మధ్వజ ఆవిష్కరణ.. ఆ చిహ్నాల పరమార్థమిదే!

Gold Rate | బంగారం కొనుగోలుదారులకు బిగ్ రిలీఫ్.. ఒకే రోజు రూ.3200 డౌన్.. అదే బాటలో వెండి

NMMSS Scholarship 2026 | విద్యార్థులకు అలర్ట్: కేంద్ర స్కాలర్షిప్ గడువు పెంపు.. ఏటా రూ.12,000 పొందే చాన్స్

Serial Actress | లంగా ఓణీలో అగ్నిసాక్షి సీరియల్ హీరోయిన్ అందాలు అదుర్స్



