త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rahul Gandhi | దేశ ద్రోహి.. మిత్ర ద్రోహి.. రాహుల్‌, కేంద్ర మంత్రి మ‌ధ్య వాగ్వాదం

Rahul Gandhi | పార్ల‌మెంట్ వెలుప‌ల ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ (Ravneet Singh Bittu) మ‌ధ్య చిన్న‌పాటి వాగ్వాదం చోటు చేసుకుంది.

D

National | Published On Feb 4, 2026, 2.49 pm IST

Rahul Gandhi | దేశ ద్రోహి.. మిత్ర ద్రోహి.. రాహుల్‌, కేంద్ర మంత్రి మ‌ధ్య వాగ్వాదం
Advertisement

Rahul Gandhi | పార్ల‌మెంట్ వెలుప‌ల ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ (Ravneet Singh Bittu) మ‌ధ్య చిన్న‌పాటి వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక‌రినొక‌రు దేశ ద్రోహి (desh ke dushman), మిత్ర ద్రోహి (traitor friend) అంటూ దూషించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. మంగ‌ళ‌వారం లోక్‌స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. రాహుల్ ప్ర‌సంగాన్ని అధికార ప‌క్ష ఎంపీలు అడ్డుకోవ‌డంపై కాంగ్రెస్ ఎంపీలు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. స‌భ‌లో గంద‌ర‌గోళం సృష్టించారు. కొంద‌రు ఎంపీలు పేప‌ర్లు చింపి స్పీక‌ర్‌పై విసిరేశారు. దీంతో ఎనిమిది మంది ఎంపీల‌ను సెష‌న్ మొత్తం స్పీక‌ర్ సస్పెండ్ చేశారు. ఎంపీల‌ను స‌స్పెండ్ చేయ‌డంపై ఇవాళ ఉద‌యం కాంగ్రెస్ పార్టీ స‌భ్యులు ఆందోళ‌న‌కు దిగారు. పార్ల‌మెంట్ వెలుప‌ల మ‌క‌ర ద్వారం వ‌ద్ద‌ నిర‌స‌న చేప‌ట్టారు. కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.

అదే స‌మ‌యంలో అటుగా వ‌చ్చిన కేంద్ర మంత్రి బిట్టూను చూసిన రాహుల్‌.. "ఇటు చూడండి.. ఓ ద్రోహి ఇటువైపు వ‌చ్చారు. అత‌డి మొహం చూడండి" అంటూ వ్యాఖ్యానించారు. "హ‌లో బ్ర‌ద‌ర్‌. నా మిత్ర ద్రోహి. కంగారు ప‌డ‌కు నువ్వు మ‌ళ్లీ కాంగ్రెస్‌లోకి తిరిగి వ‌స్తావు" అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు వెళ్లాడు. అయితే, "దేశ ద్రోహి" అంటూ రాహుల్ షేక్‌హ్యాండ్‌ను కేంద్ర మంత్రి తిర‌స్క‌రించాడు. "వారిని చూడండి యుద్ధంలో గెలిచిన‌ట్లు ఎలా కూర్చున్నారో" అంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ, రవ్‌నీత్ బిట్టూ మధ్య కొద్ది సేపు మాటల యుద్ధం సాగింది. ఆ త‌ర్వాత కేంద్ర మంత్రి అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను వీడిన రవ్‌నీత్ బీజేపీలో చేరారు. ఇక మోదీ కేబినెట్‌లో రైల్వే శాఖ స‌హాయ మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు.

https://x.com/ndtv/status/2018948640736461207

Advertisement
Advertisement