Rahul Gandhi | ఓటు చోరీని అడ్డుకోవాలి.. ఎస్‌ఐఆర్‌ను నిలిపివేయాలి : రాహుల్‌గాంధీ
Rahul Gandhi | ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ఓట్ల చోరీ ఆరోపణలపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ గళమెత్తారు. ఈ అంశాలపై నిరసనగా అక్టోబర్ 12న సోమవారం విపక్ష పార్టీలతో కలిసి సుప్రీంకోర్టు వరకు మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
Rahul Gandhi | ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ఓట్ల చోరీ ఆరోపణలపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ గళమెత్తారు. ఈ అంశాలపై నిరసనగా అక్టోబర్ 12న సోమవారం విపక్ష పార్టీలతో కలిసి సుప్రీంకోర్టు వరకు మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని విశ్వసించే యువత, పౌరసంఘాల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో శనివారం శాంతియుతంగా నిరసన తెలిపిన యువతపై పోలీసులు, బీజేపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారని రాహుల్‌గాంధీ ఆరోపించారు.
యువత తమ నిరసనలో ద్వేషం, ఆగ్రహం కాకుండా ప్రేమను వ్యక్తం చేశారని పేర్కొన్నారు. అలాంటి యువతపై దాడులు జరగడం ఆమోదయోగ్యం కాదని అన్నారు. దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉండకూడదని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. పార్టీలు, కులాలు, మతాలు, ప్రాంతాలు, లింగభేదాలకు అతీతంగా భారతీయులుగా ఒక్కటై సుప్రీంకోర్టు దిశగా పాదయాత్ర చేపడతామని వెల్లడించారు. ఈ మార్చ్‌లో విపక్ష పార్టీలతో పాటు పౌరసమాజ ప్రతినిధులు, రాజ్యాంగ పరిరక్షణను కోరుకునే వారంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
దేశ ప్రజల తరఫున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వినతిపత్రం అందజేయనున్నట్లు రాహుల్‌గాంధీ తెలిపారు. ఓట్ల చోరీని అడ్డుకోవడం, ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిలిపివేయడం, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయడం తమ ప్రధాన డిమాండ్లని స్పష్టం చేశారు. ప్రజల గొంతుకను అణచివేయడం ఎవరి వల్లా కాదని ఇండియా కూటమి నేతలు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్లను ప్రస్తావిస్తూ.. వారి వల్ల ప్రజల స్వరాన్ని అణచివేయలేరని వ్యాఖ్యానించారు. భయానికి తావులేకుండా ప్రేమ, సోదరభావం, దేశభక్తితో ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Faria Abdullah | కమల్‌హాసన్ డైరెక్టర్‌తో ఫరియా అబ్దుల్లా తెలుగు వెబ్‌సిరీస్ - టైటిల్ ఇదే
- ●Dasoju Sravan Kumar | విద్యావంతుల మౌనంతోనే అనర్హులకు అధికారం : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
- ●Urvashi Rautela | గాయనిగా ఊర్వశి రౌతేలా.. ‘హార్ట్ కంట్రోలర్’తో కొత్త ఇన్నింగ్స్!
- ●Revanth Reddy Goa Speech | 2026లో కేరళ.. 2027లో గోవా.. నైరుతి రుతుపవనాల్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుడే
- ●Djibouti Boat Capsizes Migrants | గల్ఫ్ కలల బాటలో ఘోర విషాదం: మునిగిన శరణార్థుల బోటు.. 15 మంది చిన్నారులతో సహా 100 మందికి పైగా మృతి
- ●Keerthi Reddy | పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ హీరోయిన్... ఇప్పుడు ఎలా ఉందో చూశారా?

Faria Abdullah | కమల్‌హాసన్ డైరెక్టర్‌తో ఫరియా అబ్దుల్లా తెలుగు వెబ్‌సిరీస్ - టైటిల్ ఇదే

Dasoju Sravan Kumar | విద్యావంతుల మౌనంతోనే అనర్హులకు అధికారం : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

Urvashi Rautela | గాయనిగా ఊర్వశి రౌతేలా.. ‘హార్ట్ కంట్రోలర్’తో కొత్త ఇన్నింగ్స్!

Revanth Reddy Goa Speech | 2026లో కేరళ.. 2027లో గోవా.. నైరుతి రుతుపవనాల్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుడే




