త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AI summit | ఇది సిగ్గుమాలిన చ‌ర్య‌.. ఏఐ స‌ద‌స్సులో చైనా రోబోను ప్ర‌ద‌ర్శించ‌డంపై రాహుల్ ఫైర్‌

AI summit | దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న 'ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సదస్సు' (India AI Impact Summit 2026)లో గల్గోటియాస్ వ‌ర్సిటీ ప్ర‌ద‌ర్శించిన రోబో తీవ్ర వివాదాస్ప‌ద‌మైన విష‌యం తెలిసిందే. ఈ వివాదంపై ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రంగా స్పందించారు. దీన్ని సిగ్గుమాలిన చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు.

D

National | Published On Feb 18, 2026, 2.59 pm IST

AI summit | ఇది సిగ్గుమాలిన చ‌ర్య‌.. ఏఐ స‌ద‌స్సులో చైనా రోబోను ప్ర‌ద‌ర్శించ‌డంపై రాహుల్ ఫైర్‌
Advertisement

AI summit | దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న 'ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సదస్సు' (India AI Impact Summit 2026)లో గల్గోటియాస్ వ‌ర్సిటీ ప్ర‌ద‌ర్శించిన రోబో తీవ్ర వివాదాస్ప‌ద‌మైన విష‌యం తెలిసిందే. చైనాకు చెందిన‌ రోబోటిక్స్ సంస్థ Unitree అభివృద్ధి చేసిన రోబోట్‌ను (Galgotias robodog row) వ‌ర్సిటీ ప్ర‌ద‌ర్శించింది. దీనిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇక ఈ వివాదంపై ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రంగా స్పందించారు. దీన్ని సిగ్గుమాలిన చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు.

ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వంపై తీవ్ర విమర్శ‌లు చేశారు. భారత్ ప్రతిభను ప్రపంచానికి చూపకుండా పీఆర్ స్టంట్ చేస్తున్నారని ఆరోపించారు. భారతీయుల డేటాను అమ్మకానికి పెట్టి చైనా ఉత్పత్తులను ప్ర‌ద‌ర్శిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. ఏఐ సమ్మిట్‌ను ఒక జోక్‌గా మార్చారంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. చైనా రోబోలను మనవిగా ప్రదర్శించినందుకు ఆ దేశ మీడియా మనల్ని ఎగతాళి చేస్తోందని వ్యాఖ్యానించారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టారు.

అది చైనా రోబో డాగ్‌..

గ్రేటర్ నోయిడాకు చెందిన గల్గోటియాస్‌ యూనివర్సిటీ దిల్లీలో జరుగుతోన్న ఏఐ సదస్సులో ఒక స్టాల్‌ను ఏర్పాటు చేసింది (India AI Impact Summit). ఈ సంద‌ర్భంగా Orion పేరుతో ఓ రోబోను ప్ర‌ద‌ర్శించింది. దాని ప‌నితీరును మీడియాకు వివ‌రించింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో కూడా వైర‌ల్‌గా మారింది. ఇది చూసిన నెటిజ‌న్లు ఆ రోబోడాగ్ చైనా సంస్థ అభివృద్ధి చేసిన‌దిగా గుర్తించారు. వాస్తవానికి అది Unitree రూపొందించిన‌ Go2 మోడల్ రోబోటిక్ డాగ్‌ అని, ఆన్‌లైన్‌లో రూ.2 ల‌క్ష‌ల నుంచి రూ.3 లక్షల ధరకు లభిస్తుంద‌ని పలువురు నెటిజన్లు ఆరోపించారు. ఈ మేర‌కు యూనివ‌ర్సిటీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఈ వ్య‌వ‌హారం దేశ‌వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. విప‌క్ష పార్టీలు ప్ర‌ధాని మోదీ నేతృత్వంలోని ప్ర‌భుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతో ఈ వివాదాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న కేంద్రం.. సదస్సులో నుంచి గల్గోటియాస్ వ‌ర్సిటీని బ‌య‌ట‌కు పంపేసింది.

యూనివ‌ర్సిటీ ఏమంటోందంటే..?

ఈ వివాదంపై గ్రేట‌ర్ నోయిడాకు చెందిన‌ Galgotias University తాజాగా స్పష్ట‌త‌ను ఇచ్చింది. తాము ఆ రోబోటిక్ డాగ్‌ను స్వయంగా అభివృద్ధి చేశామని ఎప్పుడూ చెప్పలేదని, దాన్ని చైనాకు చెందిన రోబోటిక్స్ సంస్థ Unitree నుంచి కొనుగోలు చేశామ‌ని యూనివర్సిటీ స్పష్టం చేసింది. త‌మ‌ విద్యార్థులకు ప్రాయోగిక అనుభవం కల్పించాలనే లక్ష్యంతో ప్రపంచంలోని ఉత్తమ సాంకేతికతలను వినియోగిస్తున్నామ‌ని, Unitree నుంచి కొనుగోలు చేసిన ఈ రోబో డాగ్ కూడా అదే ప్రయాణంలో భాగమ‌ని తెలిపింది. ఇది కేవలం ప్రదర్శన వస్తువు కాద‌ని, కదిలే తరగతి గది లాంటిదని, దీంతో త‌మ‌ విద్యార్థులు ప్రయోగాలు చేస్తున్నారని, ఈ రోబో డాగ్‌ను తాము తయారు చేయలేద‌ని, తయారు చేశామని కూడా ఎప్పుడూ చెప్పలేదని పోస్టు పెట్టింది.

అమెరికా, చైనా, సింగపూర్ వంటి దేశాల నుంచి ఆధునిక సాంకేతికతను క్యాంపస్‌కు తీసుకొచ్చి విద్యార్థులకు వాస్తవ అనుభవం కల్పించడమే తమ లక్ష్యమని తెలిపింది. ప్రపంచ స్థాయి పరిష్కారాలను భారత్ నుంచి రూపొందించేలా యువతను ప్రోత్సహించడమే త‌మ‌ ప్రధాన ఉద్దేశ్యం అని గాల్గోటియాస్ యూనివర్సిటీ స్పష్టం చేసింది. వైరల్ వీడియోలో మాత్రం గాల్గోటియాస్ యూనివర్సిటీకి చెందిన ఓ మ‌హిళా ప్ర‌తినిధి ఆ రోబోటిక్ డాగ్‌ను త‌మ వ‌ర్సిటీ రూ.350 కోట్ల‌తో స్వ‌యంగా అభివృద్ధి చేసింద‌ని, త‌మ వర్సిటీకి చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విభాగం వారు దాన్ని రూపొందించార‌ని, దాని పేరు ఓరియ‌న్ అని స్ప‌ష్టం చేసింది. అయిన‌ప్ప‌టికీ ఆ యూనివ‌ర్సిటీ మాత్రం తాము ఆ రోబోడాగ్‌ను అభివృద్ధి చేయ‌లేద‌ని పోస్టులో చెప్పింది. దీంతో ఈ విష‌యంపై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆ యూనివ‌ర్సిటీ ఇలాంటి చీప్ ట్రిక్స్‌ను ప్లే చేసి భార‌త్ ప‌రువు తీసింద‌ని, ఏఐ స‌మ్మిట్‌లో విదేశీ ప్ర‌తినిధుల ఎదుట భార‌త్ ప్ర‌తిష్ట దిగ‌జారింద‌ని అంటున్నారు.

Advertisement
Advertisement