త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rahul Gandhi Big Charge on US Trade Deal | మోదీజీ కాంప్రమైజ్ అయ్యారు.. దేశాన్ని అమ్మేశారు: అమెరికా వాణిజ్య ఒప్పందంపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి ప్రధాని మోదీ ఈ ఒప్పందంపై సంతకం చేశారని, ఆయన కాంప్రమైజ్ అయ్యి దేశాన్ని అమ్మేశారని రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. అదానీ కేసు, ఎప్‌స్టీన్ ఫైల్స్ అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు.

J

National | Published On Feb 3, 2026, 3.37 pm IST

Rahul Gandhi Big Charge on US Trade Deal | మోదీజీ కాంప్రమైజ్ అయ్యారు.. దేశాన్ని అమ్మేశారు: అమెరికా వాణిజ్య ఒప్పందంపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

సంక్షిప్త సారాంశం

లోక్‌సభలో చైనా సరిహద్దు వివాదం, ఆర్మీ మాజీ చీఫ్ నరవణే పుస్తకం వంటి అంశాలపై మాట్లాడేందుకు స్పీకర్ అనుమతి నిరాకరించడంతో రాహుల్ గాంధీ పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడితోనే మోదీ రాత్రికి రాత్రే వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశారని ఆరోపించారు. ప్రధాని మోదీ తన ఇమేజ్ దెబ్బతింటుందనే భయంతో కాంప్రమైజ్ అయ్యారని, అందుకే దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని రాహుల్ మండిపడ్డారు. అమెరికాలో అదానీపై ఉన్న కేసు, ఎప్‌స్టీన్ ఫైల్స్ వంటివి మోదీని భయపెడుతున్నాయని అన్నారు. అయితే, ఎప్‌స్టీన్ ఫైల్స్ ఆరోపణలను భారత ప్రభుత్వం ఇప్పటికే ఖండించిన విషయం తెలిసిందే.

Advertisement

Rahul Gandhi Big Charge on US Trade Deal | అమెరికాతో భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ "కాంప్రమైజ్" (రాజీ పడటం) అయ్యారని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి మేరకే ఈ ఒప్పందంపై సంతకం చేశారని సంచలన ఆరోపణలు చేశారు.

మంగళవారం పార్లమెంటు ఆవరణలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ భయపడుతున్నారని, అందుకే దేశ ప్రయోజనాలను పణంగా పెట్టారని విమర్శించారు. లోక్‌సభలో చైనా అంశంపై, మాజీ ఆర్మీ చీఫ్ నరవణే పుస్తకంపై మాట్లాడేందుకు స్పీకర్ అనుమతి నిరాకరించిన నేపథ్యంలో రాహుల్ గాంధీ బయట ఈ వ్యాఖ్యలు చేశారు.

"మోదీజీ వణికిపోతున్నారు.. మోదీజీ కంగారుపడుతున్నారు. గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన ఇండో-యుఎస్ (India-US) వాణిజ్య ఒప్పందంపై నరేంద్ర మోదీ నిన్న రాత్రి హఠాత్తుగా సంతకం చేశారు. ఆయనపై విపరీతమైన ఒత్తిడి ఉంది. తన ఇమేజ్ దెబ్బతింటుందనే భయం ఆయనలో కనిపిస్తోంది," అని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.

పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చైనా అంశాన్ని లేవనెత్తేందుకు రాహుల్ ప్రయత్నించగా, నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ స్పీకర్ ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

"దేశాన్ని అమ్మేశారు.. అసలు విషయం ఏంటంటే.. మన ప్రధాని రాజీపడ్డారు (Compromised). ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. చరిత్రలో తొలిసారిగా ప్రతిపక్ష నేతను (LoP) రాష్ట్రపతి ప్రసంగంపై మాట్లాడనివ్వలేదు. మోదీజీ కాంప్రమైజ్ అయ్యారు కాబట్టే.. మీ కష్టార్జితాన్ని ఈ వాణిజ్య ఒప్పందంలో అమ్మేశారు. ఆయన దేశాన్ని అమ్మేశారు," అని రాహుల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

అదానీ, ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రస్తావన

ప్రధాని భయానికి కారణాలను వివరిస్తూ రాహుల్ గాంధీ అదానీ అంశాన్ని, ఎప్‌స్టీన్ ఫైల్స్ (Epstein Files)ను ప్రస్తావించారు. "ఎవరైతే మోదీ ఇమేజ్‌ను సృష్టించారో, ఇప్పుడు వాళ్లే దాన్ని బద్దలు కొడుతున్నారు. అమెరికాలో అదానీపై ఉన్న కేసు వాస్తవానికి మోదీపై ఉన్న కేసు లాంటిదే. ఇక ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో అమెరికా ఇంకా బయటపెట్టని విషయాలు చాలా ఉన్నాయి. ఆ భయం కూడా మోదీలో ఉంది. ఈ రెండు అంశాల ఒత్తిడి వల్లే ఆయన లొంగిపోయారు," అని రాహుల్ ఆరోపించారు.

భారత్ ఖండన

కాగా, ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ప్రధాని మోదీ పేరు ఉందన్న వార్తలను భారత ప్రభుత్వం (MEA) గతంలోనే తీవ్రంగా ఖండించింది. జనవరి 31న విదేశాంగ శాఖ ప్రతినిధి స్పందిస్తూ.. 2017 జూలైలో ప్రధాని ఇజ్రాయెల్ అధికారిక పర్యటనకు వెళ్లారని, అంతకు మించి ఆ ఈమెయిల్స్‌లో ఉన్న ఆరోపణలన్నీ నిరాధారమని, పనికిమాలినవని (Baseless) స్పష్టం చేశారు. ఆ ఫైల్స్‌లో ఉన్న ప్రస్తావన కేవలం ప్రధాని అధికారిక పర్యటనకు సంబంధించిందేనని తేల్చిచెప్పారు.

Advertisement
Advertisement