త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AJA Consulting Services | ఉద్యోగుల‌కు ప్రోత్సాహ‌కాలు ప్ర‌క‌టించిన అజా క‌న్స‌లిస్టింగ్ స‌ర్వీసెస్‌

AJA Consulting Services | పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన పొదుపు దిశగా ముందడుగు వేస్తూ హైదరాబాద్‌కు చెందిన టెక్ సంస్థ అజా కన్సల్టింగ్ సర్వీసెస్ తమ ఉద్యోగులకు ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు సంస్థ ‘గ్రీన్ పాలసీ’ అమల్లోకి తీసుకొచ్చింది.

P

Hyderabad | Published On May 20, 2026, 3.49 pm IST

AJA Consulting Services | ఉద్యోగుల‌కు ప్రోత్సాహ‌కాలు ప్ర‌క‌టించిన అజా క‌న్స‌లిస్టింగ్ స‌ర్వీసెస్‌
Advertisement

AJA Consulting Services | పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన పొదుపు దిశగా ముందడుగు వేస్తూ హైదరాబాద్‌కు చెందిన టెక్ సంస్థ అజా కన్సల్టింగ్ సర్వీసెస్ తమ ఉద్యోగులకు ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు సంస్థ ‘గ్రీన్ పాలసీ’ అమల్లోకి తీసుకొచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు పెట్రోల్‌, డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు సంస్థ సీఈఓ ఫణిరాజ్ జలిగామ తెలిపారు. ఈవీ కార్లు కొనుగోలు చేసే ఉద్యోగులకు రూ.10వేల ప్రోత్సాహకం, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసే వారికి రూ.5వేల నగదు ప్రోత్సాహకం అందజేస్తామని వెల్లడించారు.

ఇటీవల అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా ఇజ్రాయెల్–ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయని, ఈ పరిస్థితుల్లో ఇంధన వినియోగాన్ని తగ్గించడం అత్యవసరమైందని ఫణిరాజ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కార్‌పూలింగ్‌ను ప్రోత్సహించడంతో పాటు ప్రజా రవాణా వినియోగాన్ని పెంచాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఇంధన దిగుమతులపై ఆధారపడే పరిస్థితిని తగ్గించడం ద్వారా దేశ విదేశీ మారక నిల్వలను ఆదా చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పర్యావరణ హిత రవాణా విధానాలను ఉద్యోగులు ఎంచుకునేలా ప్రోత్సహించడం, కార్యాలయాలను ‘గ్రీన్ వర్క్‌ప్లేస్’లుగా మార్చడం తమ లక్ష్యమని తెలిపారు. సాంకేతిక రంగ సంస్థలు సామాజిక బాధ్యతతో ముందుకు వస్తే పర్యావరణ పరిరక్షణలో గణనీయమైన మార్పు సాధ్యమవుతుందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement