Pawan Khera | సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నేత పవన్ ఖేరా..!
Pawan Khera | కాంగ్రెస్ నేత పవన్ ఖేరా గువాహటి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై అసోం పోలీసులు నమోదు చేసిన పరువునష్టం, ఫోర్జరీ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడాన్ని సవాల్ చేశారు.
Pawan Khera | కాంగ్రెస్ నేత పవన్ ఖేరా గువాహటి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై అసోం పోలీసులు నమోదు చేసిన పరువునష్టం, ఫోర్జరీ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడాన్ని సవాల్ చేశారు. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ భార్య రినికీ భూయన్ శర్మ ఫిర్యాదు మేరకు పవన్ ఖేరాపై కేసు నమోదైంది. ఇటీవల ఖేరా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమెకు సంబంధించిన విదేశీ పాస్‌పోర్టులు ఉన్నాయని, విదేశాల్లో ప్రకటించని ఆస్తులు ఉన్నాయని ఆరోపించారు.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె అసోం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఫిర్యాదు అనంతరం పోలీసులు పవన్ ఖేరా నివాసంపై దాడులు నిర్వహించారు. ఈ కేసులో ఆయనకు ముందుగా తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, దీనిపై అసోం పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌పై స్టే విధించింది. తర్వాత ఖేరా గౌహతి హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, అదే కేసులో ఆయన వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Shakib Al Hasan | బంగ్లా క్రికెటర్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి..
- ●Holidays | రెండో శనివారం, బోనాలు.. వరుసగా మూడు రోజులు సెలవులు
- ●Hyderabad | క్యాబ్‌లో పర్సు మర్చిపోయిన ప్రయాణికుడు.. తీరా చూస్తే అకౌంట్లో నుంచి రూ.31 వేలు విత్‌డ్రా
- ●Horoscope | ఆగస్టు 6 రాశిఫలాలు.. ఈ రాశి వారు పోటీల్లో విజయం సాధిస్తారు!
- ●Gujarat High Court | నేరం నాది కాదు ఆకలిది.. అన్నం అడిగిన కుమార్తెపై దాడి చేసి మరణానికి కారణమైన తల్లికి బెయిల్
- ●Punjab Haryana High Court | భార్యపై దాడి చేసిన భర్తకు బెయిల్ ఇచ్చి.. ఊహించని షరతు విధించిన హైకోర్టు!

Shakib Al Hasan | బంగ్లా క్రికెటర్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి..

Holidays | రెండో శనివారం, బోనాలు.. వరుసగా మూడు రోజులు సెలవులు

Hyderabad | క్యాబ్‌లో పర్సు మర్చిపోయిన ప్రయాణికుడు.. తీరా చూస్తే అకౌంట్లో నుంచి రూ.31 వేలు విత్‌డ్రా

Horoscope | ఆగస్టు 6 రాశిఫలాలు.. ఈ రాశి వారు పోటీల్లో విజయం సాధిస్తారు!






