PM Modi | నేడు నోయిడాకు నరేంద్ర మోదీ.. కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును జాతికి అంకితం చేయనున్న ప్రధాని
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆయన జాతికి అంకితం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతానికి కనెక్టివిటీ, వాణిజ్యానికి ఈ ప్రాజెక్టు ఊతమిస్తుందని పేర్కొన్నారు.
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆయన జాతికి అంకితం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతానికి కనెక్టివిటీ, వాణిజ్యానికి ఈ ప్రాజెక్టు ఊతమిస్తుందని పేర్కొన్నారు. ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ తగ్గడంలో కూడా ఈ విమానాశ్రయం కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టుల్లో ఇది ఒకటని, ప్రయాణికుల సౌకర్యాలతో పాటు దిగుమతి, ఎగుమతులకు సంబంధించిన కార్గో సేవలు పరిశ్రమలకు మేలు చేస్తాయని చెప్పారు.

నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని మోదీ 2021 నవంబర్ 25న శంకుస్థాపన చేశారు. దాదాపు నాలుగున్నరేళ్లలో తొలి దశ పనులు రూ.11,200 కోట్ల వ్యయంతో పూర్తయ్యాయి. ఈ విమానాశ్రయం ఆలోచన 2001లో అప్పటి ముఖ్యమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రభుత్వ కాలంలో ముందుకొచ్చింది. దాదాపు 25 ఏళ్ల ప్రయాణం తర్వాత ఇది సాకారమైంది. 2019లో ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. అదే ఏడాది నవంబర్ 29న స్విట్జర్లాండ్‌కు చెందిన జ్యూరిచ్ ఎయిర్‌పోర్ట్ ఇంటర్నేషనల్ ఏజీకి నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. 2020 అక్టోబర్ 7న రాష్ట్ర ప్రభుత్వం కన్సెషన్ ఒప్పందం కుదుర్చుకోగా, డిసెంబర్ 18న ‘నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్’ అనే అధికారిక పేరు నిర్ణయించారు. 2022లో టాటా ప్రాజెక్ట్స్ నిర్మాణ బాధ్యతలు చేపట్టగా, 2023లో కార్గో హబ్ అభివృద్ధికి ఎయిర్ ఇండియా సాట్స్ ఎంపికైంది.

ప్రయాణికుల కోసం ఆధునిక డిజిటల్ వ్యవస్థలు, బయోమెట్రిక్ సౌకర్యాల కోసం అమాడియస్‌తో ఒప్పందం కుదిరింది. 2023 సెప్టెంబర్ 27న విమానాశ్రయానికి ‘డీఎక్స్‌ఎన్’ ఐఏటీఏ కోడ్ లభించింది. ఇండిగో, ఆకాసా ఎయిర్‌లైన్స్‌తో ఒప్పందాలు కుదిరాయి. 2024లో గ్రౌండ్ హ్యాండ్లింగ్, ఇంధన పైప్‌లైన్, సౌర-వాయు విద్యుత్ ప్రాజెక్టుల కోసం పలు సంస్థలతో ఒప్పందాలు జరిగాయి. అదే ఏడాది అక్టోబర్‌లో రన్‌వే సదుపాయాలు సిద్ధమవగా.. డిసెంబర్‌లో ఇండిగో టెస్ట్ ఫ్లైట్ విజయవంతంగా ల్యాండ్ అయింది. 2026 మార్చి 5న పౌర విమానయాన శాఖ నుంచి అనుమతులు లభించగా, మార్చి 6న విమానాశ్రయానికి అధికారిక లైసెన్స్ జారీ అయింది. దీంతో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి మార్గం సుగమమైంది.

ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






