Noida Airport | జేవార్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి సన్నాహాలు.. హాజరుకానున్న ప్రధాని మోదీ..!
Noida Airport | ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా నిర్మించిన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించనున్నారు. మార్చి 28, 29 తేదీల్లో ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Noida Airport | ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా నిర్మించిన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించనున్నారు. మార్చి 28, 29 తేదీల్లో ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అనంతరం బహిరంగసభలో ప్రధాని పాల్గొంటారని చెప్పాయి. కార్యక్రమానికి హాజరయ్యే అతిథుల కోసం అడిషనల్ కమిషనర్ రాజీవ్ మిశ్రా సహా ఇతర అధికారులు ఎయిర్‌పోర్ట్ ప్రాంగణాన్ని పరిశీలించి, ప్రారంభోత్సవ సన్నాహకాలను అంచనా చేశారు.
జిల్లా మేజిస్ట్రేట్ మెధా రూపం ప్రారంభోత్సవానికి సంబంధించి పర్యావరణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సభ కోసం జర్మన్ శైలి హ్యాంగర్ నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ హ్యాంగర్‌లో సభ జరుగుతుంది. ఇదిలా ఉండగా.. ఈ ఎయిర్‌పోర్ట్ నుంచి తొలి దశలో బెంగళూరు, ముంబయి, కోల్‌కతాకు సర్వీసులు నడువనున్నాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సేవలు ప్రారంభంపై చర్చలు జరిపారు. తొలి దశలో జేవార్ ఎయిర్‌పోర్ట్ నుంచి సుమారు పది నగరాలకు సర్వీసులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






