త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

No LPG Shortage in India | దేశంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు.. ఆ వార్తలను నమ్మొద్దు : కేంద్రం క్లారిటీ

దేశంలో ఎల్పీజీ (LPG) గ్యాస్ కొరత ఉందన్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని నిత్యావసర వస్తువుల చట్టం కింద అన్ని రిఫైనరీలను ఆదేశించినట్లు పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న లక్ష అవుట్‌లెట్లలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని ఆమె స్పష్టం చేశారు.

J

National | Published On Mar 12, 2026, 6.39 pm IST

No LPG Shortage in India | దేశంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు.. ఆ వార్తలను నమ్మొద్దు : కేంద్రం క్లారిటీ
Advertisement

ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీలకు కేంద్రం కీలక ఆదేశాలు

No LPG Shortage in India | త్రినేత్ర.న్యూస్ : దేశంలో ఎల్పీజీ గ్యాస్ సంక్షోభం నెలకొందన్న వార్తల నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పందించింది. దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరా సజావుగానే సాగుతోందని, ఎక్కడా కొరత లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు పెట్రోలియం శాఖ (మార్కెటింగ్ అండ్ ఆయిల్ రిఫైనరీ) జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మీడియాతో మాట్లాడారు.

No LPG Shortage in India | గరిష్ట స్థాయికి ఎల్పీజీ ఉత్పత్తి

ఎల్పీజీ ఉత్పత్తిని గరిష్ట స్థాయికి పెంచాలని అన్ని రిఫైనరీలను ఆదేశిస్తూ మార్చి 9న కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసిందని సుజాత శర్మ తెలిపారు. నిత్యావసర వస్తువుల చట్టం కింద ఈ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న ఈ చర్యల ఫలితంగా దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని ఆమె వెల్లడించారు. "నిన్నటి వరకు ఉత్పత్తి 25 శాతంగా ఉండగా, ఇప్పుడు 28 శాతానికి పెరిగింది" అని ఆమె వివరించారు.

లక్ష అవుట్‌లెట్లు.. ఎక్కడా కొరత లేదు

గ్యాస్ పంపిణీ వ్యవస్థపై సుజాత శర్మ మాట్లాడుతూ.. "దేశవ్యాప్తంగా మాకు అతిపెద్ద రిటైల్ అవుట్‌లెట్ నెట్‌వర్క్ ఉంది. దాదాపు లక్ష రిటైల్ అవుట్‌లెట్లు (గ్యాస్ ఏజెన్సీలు) దేశంలో పనిచేస్తున్నాయి. వీటిలో మెజారిటీ సంస్థలు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల పరిధిలోనివే. ఈ లక్ష అవుట్‌లెట్లలో ఎక్కడా కూడా గ్యాస్ నిల్వలు లేవనే రిపోర్ట్ మాకు రాలేదు" అని స్పష్టం చేశారు.

సహజ వాయువుపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

సహజ వాయువు దిగుమతుల గురించి ప్రస్తావిస్తూ.. కొన్ని అనివార్య కారణాల వల్ల దిగుమతులపై కొంత ప్రభావం పడిన మాట వాస్తవమేనని, అయితే తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని సుజాత శర్మ తెలిపారు. డిమాండ్, సప్లైని బ్యాలెన్స్ చేయడానికి, నిర్వహణను మెరుగుపరచడానికి కంట్రోల్ ఆర్డర్లు కూడా జారీ చేశామని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు.

https://x.com/ANI/status/2032067077713117334

 

Advertisement
Advertisement