పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోతే నో పెట్రోల్, డీజిల్
ఒకవేళ కాలం చెల్లిన వాహనాలు పెట్రోల్ బంక్‌లోకి వస్తే ఆ కెమెరాలు వెంటనే పసిగట్టి అలారం మోగిస్తాయి. దీంతో ఆ వాహనాలను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేస్తారు. డిసెంబర్ 18 నుంచి బీఎస్ 3, అంతకంటే తక్కువ స్టాండర్డ్ ఉన్న వాహనాలు ఢిల్లీ రోడ్ల మీద కనిపిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు ట్రాఫిక్ పోలీసులు.
Finance and money: loans, credit cards, LIC, savings schemes, stock basics, gold investment, insurance.
న్యూఢిల్లీ – ఎన్‌సీఆర్ పరిధిలో వాయు కాలుష్య కోరులు చాచుతోంది. రోజురోజుకూ కాలుష్యం ఎక్కువవుతోంది. ఓవైపు చలికాలం కావడం, దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ కూడా తగ్గిపోయి ఢిల్లీ ప్రాంతం తీవ్రమైన కాలుష్య కోరల్లో చిక్కుకుంది. దీంతో కాలుష్యాన్ని తగ్గించే పనిలో పడ్డాయి ప్రభుత్వాలు. గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే అన్ని సంస్థలు 50 శాతం మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ఆదేశించింది. భవన నిర్మాణ పనులపై నిషేధం విధించింది. పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. మరోవైపు బీఎస్ 4 కంటే తక్కువ స్టాండర్డ్ ఉన్న వాహనాలన్నింటినీ డిసెంబర్ 18 నుంచి ఢిల్లీలోకి ఎంట్రీ లేకుండా చేసింది. 10 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలు ఢిల్లీ వీధుల్లో తిరగడానికి వీలు లేదు. వాటిపై సుప్రీం కోర్టు నిషేధాన్ని విధించింది. బీఎస్ 4 ఆపైన స్టాండర్డ్ ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతిని ఇచ్చారు.
గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ కింద కఠిన నిబంధనలు
ఢిల్లీ ప్రభుత్వం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(GRAP) ను తీసుకొచ్చింది. వాయు కాలుష్యాన్ని నియంత్రించడం కోసం తీసుకొచ్చిన ప్లాన్ ఇది. దీని కింద అత్యంత కఠినమైన నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది. 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలు ఢిల్లీలో తిరిగితే వాటిని గుర్తించేందుకు పెట్రోల్ బంక్‌ల వద్ద అత్యాధునిక ఏఐ కెమెరాలు, ఆటోమెటిక్ నెంబర్ ప్లేట్ రీడర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
కాలం చెల్లిన వాహనాలు వస్తే మోగనున్న అలారం
ఒకవేళ కాలం చెల్లిన వాహనాలు పెట్రోల్ బంక్‌లోకి వస్తే ఆ కెమెరాలు వెంటనే పసిగట్టి అలారం మోగిస్తాయి. దీంతో ఆ వాహనాలను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేస్తారు. డిసెంబర్ 18 నుంచి బీఎస్ 3, అంతకంటే తక్కువ స్టాండర్డ్ ఉన్న వాహనాలు ఢిల్లీ రోడ్ల మీద కనిపిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు ట్రాఫిక్ పోలీసులు.
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోతే పెట్రోల్ బంక్‌లోకి నో ఎంట్రీ
మరోవైపు అన్ని వాహనదారులు ఖచ్చితంగా పొల్యూషన్ సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలని ఢిల్లీ ప్రభుత్వం షాకింగ్ రూల్ తీసుకొచ్చింది. కాలుష్య నియంత్రణ పత్రం లేని వాహనాలకు ఢిల్లీలో ఏ పెట్రోల్ బంక్‌లో కూడా పెట్రోల్, డీజిల్ అమ్మకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పొల్యూషన్ సర్టిఫికెట్ గడువు ముగిసిన వెహికిల్స్‌కి పెట్రోల్, డీజిల్ పోయొద్దని ప్రభుత్వం నిషేధం విధించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్




