NCERT Book Row | నిపుణుల కమిటీతో సిలబస్‌ని సమీక్షించండి.. కేంద్రానికి సుప్రీం సూచన..!
NCERT Book Row | అన్ని తరగతుల పాఠ్యపుస్తకాలను సమీక్షించాలని ఎన్‌సీఈఆర్‌టీకి ఆదేశాలు జారీ చేసినట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం బుధవారం తెలిపింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలి బెంచ్ ఎన్‌సీఈఆర్‌టీకి అప్పగించడం కంటే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి సిలబస్‌పై సమీక్షించడం మంచిదని అభిప్రాయం వ్యక్తం చేసింది.
NCERT Book Row | అన్ని తరగతుల పాఠ్యపుస్తకాలను సమీక్షించాలని ఎన్‌సీఈఆర్‌టీకి ఆదేశాలు జారీ చేసినట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం బుధవారం తెలిపింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలి బెంచ్ ఎన్‌సీఈఆర్‌టీకి అప్పగించడం కంటే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి సిలబస్‌పై సమీక్షించడం మంచిదని అభిప్రాయం వ్యక్తం చేసింది. పాఠ్యాంశాలపై సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని విచారిస్తున్న విషయం తెలిసిందే. న్యాయవ్యవస్థకు సంబంధించి అభ్యంతరకరమైన అంశాలు కలిగిన ఎన్‌సీఈఆర్‌టీ 8వ తరగతి సాంఘికశాస్త్రం పాఠ్య పుస్తకానికి సంబంధించిన అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని విచారిస్తుంది.
కేవలం 8వ తరగతికి మాత్రమే కాకుండా అన్ని తరగతుల పాఠ్యపుస్తకాలను సమీక్షించాలని ప్రభుత్వం ఎన్‌సీఈఆర్‌టీని కోరిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. పాఠ్యప్రణాళికను పరిశీలించడానికి ఆయా రంగాల నిపుణులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ఆయన ధర్మాసనానికి హామీ ఇచ్చారు. ఇంతకు ముందు సుప్రీంకోర్టు 8వ తరగతి పాఠ్యపుస్తకం ముద్రణ, పంపిణీని సుప్రీంకోర్టు పూర్తిగా నిషేధించింది. పుస్తకంలో ఉన్న విషయాలు న్యాయవ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా పన్నిన కుట్రగా కోర్టు దీన్ని అభివర్ణించింది. పాఠ్యాంశం న్యాయవ్యవస్థ ప్రతిష్టకు మచ్చలాంటిదని పేర్కొంది. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఈ పుస్తకపు ప్రతులన్నింటినీ తక్షణమే స్వాధీనం చేసుకోవాలని, ఎవరికీ అందుబాటులో లేకుండా పూర్తిగా తొలగించాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో ఎన్‌సీఈఆర్‌టీ క్షమాపణలు చెప్పింది. పుస్తకాన్ని ఉపసంహరించామని, ప్రస్తుతం అందుబాటులో లేదని తెలిపింది.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






