Supreme Court | రోజూ నమాజ్ చేయడం కుదరదు..! కార్తీక దీపం వివాదం కేసులో హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం..!
Supreme Court | తిరుప్పరకుండ్రం కార్తీక దీపం వివాదం కేసులో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. రంజాన్, బక్రీద్ సందర్భంగా కొండపై ఉన్న నెల్లితోప్పు ప్రాంతంలో ముస్లింలు ప్రార్థనలు చేసుకోవచ్చన్న కోర్టు.. ప్రతీరోజు చేసేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది.
Supreme Court | తిరుప్పరకుండ్రం కార్తీక దీపం వివాదం కేసులో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. రంజాన్, బక్రీద్ సందర్భంగా కొండపై ఉన్న నెల్లితోప్పు ప్రాంతంలో ముస్లింలు ప్రార్థనలు చేసుకోవచ్చన్న కోర్టు.. ప్రతీరోజు చేసేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. కొండపై ఉన్న నెల్లితోప్పు ప్రాంతంలో సికిందర్ బాద్షా ఔలియా దర్గా ఉంది. అయితే, కొండ పాదాల వద్ద సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది. ఈ కొండపైనే స్వామివారి నివాసంగా పేర్కొంటున్నారు. ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. కొండపై ఒక దర్గా ఉండడంతో ప్రార్థనలు, జంతుబలులు వివాదానికి దారి తీశాయి.
గతేడాది అక్టోబర్‌లో మద్రాస్ హైకోర్టు తన ఉత్తర్వుల్లో ఈ ప్రాంతంలో జంతుబలులను నిషేధించింది. హైకోర్టు ఉత్తర్వును సవాలు చేస్తూ దర్గాకు చెందిన ఒక ఇమామ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ పీబీ వరాలే ధర్మాసనం, హైకోర్టు ఉత్తర్వులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. హైకోర్టు ఉత్తర్వును సమతుల్యమైన ఉత్తర్వుగా అభివర్ణించింది. గతేడాది డిసెంబర్‌లో మద్రాస్ హైకోర్టు దర్గా సమీపంలోని దీపస్తంభం వద్ద దీపాలు వెలిగించడానికి అనుమతించింది. ఆ తర్వాత పెద్ద వివాదం చెలరేగింది. అయితే, శాంతిభద్రతలు క్షీణిస్తాయంటూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులను అమలు చేసేందుకు నిరాకరించింది. ఆ తర్వాత ప్రభుత్వంపై హైకోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
కొండపై రాతిస్తంభంపై దీపం వెలిగించుకోవచ్చని జస్టిస్ జీ జయచంద్రన్, జస్టిస్ రామకృష్ణన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. డీఎంకే ప్రభుత్వం, వక్ఫ్ బోర్డు, దర్గా కమిటీ గతంలో దాఖలు చేసిన అప్పీళ్లను కోర్టు తోసిపుచ్చింది. కార్తీక దీపాన్ని వెలిగించడానికి చట్టపరమైన అడ్డంకులు ఏమీ లేవని తేల్చి చెప్పింది. ఏడాదికోసారి కార్తీక మాసంలో జరిగిన దీపారాధనతో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతుందని ప్రభుత్వ చేసిన వాదనలు హాస్యాస్పదమని చెప్పింది. దీపం వెలిగించడాన్ని నిషేధిస్తూ ఎలాంటి ఆగమ శాస్త్రాలు, బలమైన సాక్ష్యధారాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vijay TVK cabinet 2026 | సీఎం విజయ్ ‘క్యాబినెట్ ఆఫ్ ఫస్ట్స్’: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం.. దళపతి మాస్టర్ మైండ్
మే 21, 2026

SIR | అర్హులకు ఓటు హక్కు కల్పించడమే సర్ లక్ష్యం : కలెక్టర్ గరిమ అగ్రవాల్
మే 20, 2026

Murder Case | వరంగల్‌లో జంట హత్యల కేసు: నిందితుడికి మరణశిక్ష విధించిన కోర్టు..!
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



