Mumbai BMC Election Results 2026 | మహారాష్ట్ర మున్సిపల్ పోరులో వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఫలితాల వెల్లడిలో కనిపిస్తోంది. బీజేపీ, ఏక్‌నాథ్ షిండే సారథ్యంలో శివ సేన కలిసి ఏర్పాటు చేసిన మహాయుతి ఫలితాల్లో ముందంజలో ఉంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాలను చూస్తే ముంబైతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల ఫలితాల్లో బీజేపీ ముందంజలో ఉంది. దీంతో మహారాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ఫలితాలను చూసుకుంటే ఇప్పటి వరకు ముంబైలో 110 వార్డులలో మహాయుతి కూటమి ముందంజలో ఉంది. దీంతో గత 30 ఏళ్లుగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌ను గుప్పిట్లో పెట్టుకున్న ఉద్దవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన పార్టీ ఈసారి చతికిల పడిన్నట్లయింది. 30 ఏళ్ల తన ముంబై పీఠాన్ని ఈసారి వదులుకోవాల్సి వస్తోంది. ఇప్పటి వరకు ఉద్దవ్ ఠాక్రే శివసేన 68 సీట్లు కూడా క్రాస్ చేయలేదు. ఎంఎన్‌సీ 9 వార్డుల్లో ముందంజలో ఉండగా, యూబీటీ సేన 58 వార్డులు, కాంగ్రెస్ 10 వార్డులు ముందంజలో ఉంది. శరద్ పవార్ సారథ్యంలోని ఎన్‌సీపీ ఒక్కే ఒక్క వార్డులో ముందంజలో ఉంది.