త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vande Bharat Sleeper | కూత‌పెట్ట‌నున్న తొలి వందే భార‌త్ స్లీప‌ర్ రైలు.. రేపు ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోదీ

Vande Bharat Sleeper | భార‌తీయ రైల్వే ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకువ‌చ్చిన వందే భార‌త్ స్లీప‌ర్ రైలు ప‌ట్టాలెక్కేందుకు సిద్ధ‌మైంది. దేశంలోనే తొలి రైలు హౌరా-గౌహ‌తి మ‌ధ్య రాక‌పోక‌లు సాగించ‌నున్న‌ది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ శ‌నివారం జెండా ఊపి రైలును జాతికి అంకితం చేయ‌నున్నారు.

P

National | Published On Jan 16, 2026, 4.43 pm IST

Vande Bharat Sleeper | కూత‌పెట్ట‌నున్న తొలి వందే భార‌త్ స్లీప‌ర్ రైలు.. రేపు ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోదీ
Advertisement

Vande Bharat Sleeper | భార‌తీయ రైల్వే ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకువ‌చ్చిన వందే భార‌త్ స్లీప‌ర్ రైలు ప‌ట్టాలెక్కేందుకు సిద్ధ‌మైంది. దేశంలోనే తొలి రైలు హౌరా-గౌహ‌తి మ‌ధ్య రాక‌పోక‌లు సాగించ‌నున్న‌ది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ శ‌నివారం జెండా ఊపి రైలును జాతికి అంకితం చేయ‌నున్నారు. దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక సౌక‌ర్యాల‌తో హైస్పీడ్ రైలును అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. ప్ర‌పంచ‌స్థాయి సౌక‌ర్యాల‌ను ప్ర‌యాణీకుల‌కు అందించే ఉద్దేశంతో రైలును తీర్చిదిద్దింది.

ఇప్ప‌టికే రైలు ట్ర‌య‌ల్ ర‌న్ పూర్తి కాగా.. రైలు ప్రారంభం కోసం ప్ర‌యాణీకులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. రైలు ప్ర‌త్యేక‌త ఏంటంటే.. స్వ‌దేశీ సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగించి ఈ రైలును త‌యారుచేశారు. దేశంలోని వివిధ మార్గాల మ‌ధ్య రైలును విజ‌య‌వంతంగా రైల్వేశాఖ ట్ర‌య‌ల్ ర‌న్ నిర్వ‌హించింది. ఇటీవ‌ల ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ రైలును ప్రారంభిస్తార‌ని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ తెలిపిన విష‌యం తెలిసిందే. స్లీప‌ర్ రైలు తూర్పు భార‌తంలో మ‌రింత క‌నెక్టివిటీని పెంచుతుంద‌ని రైల్వేశాఖ పేర్కొంది.

ఈ రైలు హౌరా-గౌహ‌తి (కామాఖ్య‌) మ‌ధ్య 958 కిలోమీట‌ర్ల దూరం చేరుకునేందుకు 14 గంట‌ల స‌మ‌యంలోనే ప్ర‌యాణిస్తుంది. ఈ రైలులో 11 థర్డ్ ఏసీ కోచ్‌లు స‌హా మొత్తం 16 కోచ్‌లు ఉన్నాయి. 4 సెకండ్ ఏసీ కోచ్‌లు, ఒక‌టి ఫ‌స్ట్ ఏసీ కోచ్ ఉన్నాయి. ఒకేసారి 823 మంది ప్ర‌యాణీకులు రాక‌పోక‌లు సాగించొచ్చు. రైలులో ఆటోమేటిక్ డోర్స్‌, వెస్టిబ్యూల్స్ ఏర్పాటు చేశారు. వందే భారత్ స్లీపర్ రైలు స్టాప్స్ ఇత‌ర రైళ్ల కంటే త‌క్కువ‌గా ఉంటాయి. దాంతో ప్ర‌యాణం మ‌రింత వేగంగా పూర్తి చేయ‌వ‌చ్చ‌ని రైల్వే వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. రైలులోని బెర్తుల‌న్నీ కుష‌న్ల‌తో సౌక‌ర్య‌వంతంగా ఉంటాయి. రైలు గంట‌కు 180 కిలోమీట‌ర్ల వేగంతో న‌డిచేలా రైల్వేశాఖ రూపొందించింది.

టికెట్ల ధ‌ర‌ల విష‌జ్ఞానికి వ‌స్తే.. థ‌ర్డ్ ఏసీ కోచ్‌లో 400 కిలోమీట‌ర్ల ప్ర‌యాణానికి రూ.960 చార్జీ వ‌సూలు చేయ‌నున్నారు. సెకండ్ ఏసీ కోచ్‌లో రూ.1250, ఫ‌స్ట్ ఏసీలో అదే దూరం ప్ర‌యాణానికి రూ.1520 చెల్లించాల్సి ఉంటుంద‌ని రైల్వే అధికారులు తెలిపారు. వెయ్యి కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణానికి రూ.2400 నుంచి రూ.3800 వ‌ర‌కు ఉంటుంది. ఈ రైలు ప్ర‌త్యేక ఏంటంటే.. ప్ర‌మాదాన్ని ముందే గుర్తించి త‌ప్పించుకునేందుకు అత్యంత అధునాత క‌వ‌చ్ యాంటీ కొల్లిష‌న్ టెక్నాల‌జీని అమ‌ర్చారు.

రైలు హౌరా-కామాఖ్య (27575) వందే భారత్ స్లీపర్ హౌరా నుంచి సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.20 గంటలకు కామాఖ్య చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 27576 కామాఖ్య నుంచి సాయంత్రం 6.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.15 గంటలకు హౌరా చేరుకుంటుంది. ప్ర‌యాణానికి మొత్తం 14 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. ఐఆర్‌సీటీసీలో టిక్కెట్ల బుకింగ్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు. దేశంలో ప్ర‌స్తుతం 164 వందే భార‌త్ చెయిర్ కార్ ట్రెయిన్స్ న‌డుస్తున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement