త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India-EU Free Trade Agreement | మదర్ ఆఫ్ ఆల్ డీల్స్: భారత్-ఈయూ మధ్య చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందం.. కార్ల ధరలు భారీగా తగ్గే అవకాశం

భారత్, యూరోపియన్ యూనియన్(ఈయూ) మధ్య దాదాపు రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరపడనుంది. 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'గా పిలుస్తున్న ఈ భారీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల భారత్‌లో యూరోపియన్ కార్ల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి.

J

National | Published On Jan 26, 2026, 1.42 pm IST

India-EU Free Trade Agreement | మదర్ ఆఫ్ ఆల్ డీల్స్: భారత్-ఈయూ మధ్య చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందం.. కార్ల ధరలు భారీగా తగ్గే అవకాశం

సంక్షిప్త సారాంశం

భారత 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత్-ఈయూ మధ్య చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరబోతోంది. దీనివల్ల యూరోపియన్ దేశాల నుంచి దిగుమతి అయ్యే లగ్జరీ కార్లపై పన్నులు 110 శాతం నుండి 40 శాతానికి తగ్గనున్నాయి. అదే జరిగితే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య ఒప్పందాలలో ఒకటిగా నిలవనుంది.

Advertisement

India-EU Free Trade Agreement | త్రినేత్ర.న్యూస్: భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే కీలక ఘట్టానికి వేదికయ్యాయి. రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా.. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో జరిపే భేటీలో చరిత్రాత్మక 'స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం' (FTA) పై సంతకం చేయనున్నారు.

సమర్థమైన భారత్.. ప్రపంచానికి కీలకం

భారతదేశం విజయవంతమైతే ప్రపంచం మరింత స్థిరంగా, సురక్షితంగా, సుసంపన్నంగా ఉంటుంది" అని ఉర్సులా వాన్ డెర్ లేయన్ పేర్కొన్నారు. భారత్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థతో జట్టు కట్టడం యూరప్‌కు ఎంతో కీలకమని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

కార్ల ధరలు భారీగా తగ్గే ఛాన్స్

ఈ ఒప్పందంలో అత్యంత ఆసక్తికరమైన అంశం దిగుమతి సుంకాల తగ్గింపు. ప్రస్తుతం యూరప్ నుంచి దిగుమతి చేసుకునే కార్లపై భారత్ 70 శాతం నుంచి 110 శాతం వరకు పన్ను విధిస్తోంది. కొత్త ఒప్పందం ప్రకారం, ఈ పన్నును తక్షణమే 40 శాతానికి తగ్గించే అవకాశం ఉంది. భవిష్యత్తులో దీనిని 10 శాతానికి పరిమితం చేయాలని యోచిస్తున్నారు. దీనివల్ల మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ (BMW), వోక్స్‌వ్యాగన్ లాంటి లగ్జరీ కార్ల ధరలు భారత్‌లో సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Mother of All Deals India-EU to Seal Historic Trade Pact Big Price Drop Likely for Luxury Cars

ఎందుకిది 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'?

భారత్, యూరోపియన్ యూనియన్ (EU) మధ్య కుదరబోతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (Free Trade Agreement - FTA) అంతర్జాతీయ వాణిజ్య రంగంలో అత్యంత భారీ, ప్రభావవంతమైనదిగా భావిస్తున్నారు. అందుకే యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ దీనిని "మదర్ ఆఫ్ ఆల్ డీల్స్" (అన్ని ఒప్పందాలకు తల్లి వంటిది) అని అభివర్ణించారు.

దీనిని అలా పిలవడానికి ప్రధాన కారణాలు ఇవే:

అసాధారణమైన భారీ మార్కెట్

ఈ ఒప్పందం ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థిక శక్తులను ఏకం చేస్తుంది. ఇది దాదాపు 200 కోట్ల మంది (భారత్ 140 కోట్లు + EU 45 కోట్లు) ప్రజలకు సంబంధించిన మార్కెట్‌ను సృష్టిస్తుంది. భారత్, EU కలిపి ప్రపంచ జీడీపీలో సుమారు 25 శాతం (నాలుగో వంతు) వాటాను కలిగి ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున జరిగే వాణిజ్య ఒప్పందం గతంలో ఎప్పుడూ లేదు. ఈ ఒప్పందం కోసం చర్చలు 2007లో మొదలై, మధ్యలో ఆగిపోయి, దాదాపు 19 ఏళ్ల తర్వాత ఇప్పుడు తుది దశకు చేరుకున్నాయి. ఇది కేవలం వస్తువుల మీద పన్నుల తగ్గింపు మాత్రమే కాదు.. కార్లు, ఔషధాలు, టెక్స్‌టైల్స్, యంత్రాలు, ఐటీ (IT), కన్సల్టింగ్, ఫైనాన్స్, ఆన్‌లైన్ వ్యాపార నిబంధనలు, ఐరోపా కంపెనీలు భారత్‌లో నేరుగా పెట్టుబడులు పెట్టడం సులభతరం అయ్యేలా చేస్తుంది.

అమెరికా టారిఫ్‌లకు గట్టి సమాధానం

ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠినమైన వాణిజ్య విధానాల (టారిఫ్ వార్) వల్ల భారత్, యూరోపియన్ దేశాలు తమ ఎగుమతులపై భారీగా పన్నులు ఎదుర్కొంటున్నాయి. ఈ సమయంలో భారత్-ఈయూ0 జతకట్టడం ద్వారా అమెరికాపై ఆధారపడటం తగ్గుతుంది. అమెరికాకు మళ్లించాల్సిన ఎగుమతులను ఈయూ దేశాలకు మళ్లించే అవకాశం కలుగుతుంది.

భారత్‌కు దక్కే భారీ ప్రయోజనాలు

టెక్స్‌టైల్స్, ఫార్మా రంగానికి సంబంధించి ప్రస్తుతం భారతీయ దుస్తులపై ఈయూలో 10 శాతం వరకు పన్ను ఉంది. ఇది సున్నా అవనుంది. భారతీయ ఐటీ నిపుణులు, విద్యార్థులు యూరోపియన్ దేశాలకు వెళ్లడం సులభతరం కానుంది. వీసా నిబంధనలు ఉండవు. యూరోపియన్ లగ్జరీ కార్లపై భారత్ విధిస్తున్న 110 శాతం వరకు ఉన్న టారిఫ్‌లు 40 శాతం నుండి 10 శాతానికి తగ్గుతాయి.

సంక్షిప్తంగా చెప్పాలంటే, ఇది కేవలం రెండు దేశాల మధ్య ఒప్పందం కాదు, ప్రపంచ వాణిజ్య ముఖచిత్రాన్నే మార్చేసే ఆర్థిక విప్లవం. అందుకే దీనిని "మదర్ ఆఫ్ ఆల్ డీల్స్" అంటున్నారు.

https://x.com/vonderleyen/status/2015648299278037497

 

Advertisement

తాజావార్తలు

Advertisement