త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | జేవ‌ర్ అంత‌ర్జాతీయ ఎయిర్‌పోర్ట్ రేపు ప్రారంభించ‌నున్న మోదీ..!

PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ శనివారం యూపీలోని జేవర్‌కు చేరుకుని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 11:30 నుంచి 12 గంటల మధ్య ఆయన జేవర్‌కు చేరుకుంటారు. ప్రారంభోత్సవం అనంతరం సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.

P

National | Published On Mar 27, 2026, 10.00 pm IST

PM Modi | జేవ‌ర్ అంత‌ర్జాతీయ ఎయిర్‌పోర్ట్ రేపు ప్రారంభించ‌నున్న మోదీ..!
Advertisement

PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ శనివారం యూపీలోని జేవర్‌కు చేరుకుని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 11:30 నుంచి 12 గంటల మధ్య ఆయన జేవర్‌కు చేరుకుంటారు. ప్రారంభోత్సవం అనంతరం సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రారంభోత్సవం అనంతరం తొలి విమాన స‌ర్వీసు ఎక్క‌డికి వెళ్తుంద‌నేది ఖ‌రారు కానుంది. ఆ త‌ర్వాత 15-20 రోజుల ముందుగానే టికెట్ల అడ్వాన్స్‌డ్ బుకింగ్ ప్రారంభం కానుంది. వాణిజ్య విమానాల బుకింగ్ ఏప్రిల్ మధ్య నుంచి ప్రారంభం కానుంద‌ని స‌మాచారం.

అంతర్జాతీయ విమానాల ప్రారంభానికి సంబంధించి విమానయాన సంస్థలతో చర్చలు కొనసాగుతున్నాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో, విస్తారా సంస్థలు దేశీయ, అంతర్జాతీయ సేవలు అందించ‌నున్నాయి. ఏప్రిల్ నుంచి తొలి దశలో దేశంలోని 12 నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ముంబ‌యి, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, కాన్పూర్, లక్నో తదితర స‌ర్వీసులు మొద‌ల‌వుతాయ‌ని, ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఈ సంఖ్యను 47 నగరాలకు విస్తరించనున్నారు. ఇండిగో 45 నగరాలకు, ఎయిర్ ఇండియా 7 నగరాలకు సేవలు అందించనుంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో విమానాశ్రయం పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

సుమారు 7వేల మంది పోలీసు సిబ్బందిని నియమించారు. ఐదు కిలోమీటర్ల పరిధిలో కఠిన నిఘా కొనసాగుతోంది. ఎస్పీజీతో పాటు కేంద్ర భద్రతా సంస్థలు సభ ప్రాంగణాన్ని పర్యవేక్షిస్తున్నాయి. గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా కార్యక్రమంలో పాల్గొననున్నారు. సభ ప్రాంగణంలో 300 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యేక కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. డీసీపీ, ఏడీసీపీ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ఈ వ్యవస్థ పనిచేస్తోంది. నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై వీవీఐపీ రాకపోకలను కూడా ప్రత్యేకంగా గమనిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement