Haryana | చెత్తతోపాటూ 100 గ్రాముల బంగారాన్ని అమ్మేసిన హర్యానా వ్యక్తి.. నాలుగు నెలల తర్వాత
Haryana | హర్యానా (Haryana) రాష్ట్రంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఫరీదాబాద్ (Faridabad)కు చెందిన అశోక్ శర్మ (Ashok Sharma) అనే వ్యక్తి గతేడాది కుంభమేళాకు వెళ్తూ.. ఇంట్లోని 100 గ్రాముల బంగారాన్ని ఓచోట భద్రంగా దాచాడు.
Haryana | హర్యానా (Haryana) రాష్ట్రంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఫరీదాబాద్ (Faridabad)కు చెందిన అశోక్ శర్మ (Ashok Sharma) అనే వ్యక్తి గతేడాది కుంభమేళాకు వెళ్తూ.. ఇంట్లోని 100 గ్రాముల బంగారాన్ని ఓచోట భద్రంగా దాచాడు. ఆ తర్వాత కూడా ఆయన దాని గురించి పట్టించుకోలేదు. ఇక అదే ఏడాది అక్టోబర్‌లో దీపావళి పండుగను పురస్కరించుకొని ఇంటిని శుభ్రం చేశారు. ఇంట్లోని చెత్తనంతా స్క్రాప్‌కు అమ్మేశాడు. ఆ చెత్తలో బంగారం సంచి కూడా ఉంది.
కొన్ని రోజుల తర్వాత ఇంట్లో బంగారం కనిపించకపోవడంతో కుటుంబం ఆందోళన చెందింది. ఆ తర్వాత బంగారం ఉన్న సంచిని చెత్తతోపాటు స్క్రాప్‌కు వేసినట్లు తెలుసుకున్నాడు. వెంటనే స్క్రాప్ డీలర్‌ను సంప్రదించాడు. అక్కడికి వెళ్లి చెత్తలో వెతకగా.. ఎక్కడా బంగారం దొరకలేదు. పోయిన బంగారం విలువ సుమారు రూ.15 లక్షల వరకూ ఉంటుంది. ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇది జరిగిన నాలుగు నెలల తర్వాత స్క్రాప్ డీలర్ అక్తర్ ఖాన్ (Haji Akhtar Khan) చెత్తను వేరు చేయడం మొదలు పెట్టాడు. అప్పుడు అతడికి ఓ సంచి కనిపించింది. దాన్ని తెరిచి చూడగా.. బంగారు ఆభరణాలు (gold jewellery) కనిపించాయి. వెంటనే అతను స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి వాటిని అప్పజెప్పాడు. అప్పటికే బంగారు ఆభరణాలు పోయినట్లు కంప్లైట్ ఉండటంతో.. అశోక్ శర్మ కుటుంబాన్ని పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. అక్తర్ ఖాన్ చేతులమీదుగా ఆభరణాలను వారికి ఇప్పించారు. దొరికింది దాచుకునే ఈ రోజుల్లో నిజాయతీగా రూ.లక్షలు విలువ చేసే బంగారాన్ని తిరిగి ఇచ్చినందుకు అతడిని ప్రశంసించారు.
సంబంధిత వార్తలు

BIS | బంగారం కొనేవారికి షాక్.. హాల్‌మార్కింగ్ ఛార్జీలు 66.7 శాతం పెంపు..
సెప్టెంబర్ 17, 2026

AIIMS Delhi Population Counter | క్షణక్షణం.. లైవ్‌లో దేశ జనాభా.. రోడ్డుపై డిజిటల్ బోర్డు ఏర్పాటు
సెప్టెంబర్ 7, 2026

Chenab River Doda Suicide | తండ్రితో ఫోన్లో మాట్లాడుతూ.. ‘బై బై నాన్న’ అంటూ నదిలోకి దూకేసిన 20 ఏళ్ల యువతి
సెప్టెంబర్ 7, 2026
తాజావార్తలు
- ●Ranbir Kapoor | వినాయకుడి ప్రసాదం వద్దన్న బాలీవుడ్ హీరో - బీఫ్ మ్యాన్ అంటూ ట్రోల్స్
- ●Special Trains | ప్రయాణికులకు తీపికబురు..! పెద్ద ఎత్తున ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే..
- ●Amazon Alexa Plus | అమెజాన్ నుంచి అలెక్సా ప్లస్.. ఇక మీ మాటే ఆదేశం..
- ●Hyderabad Liberation Day 2026 | బైరాన్‌పల్లి, నిర్మల్‌లో వెయ్యి మందిని ఉరితీసిన నిజాం రాజును అసెంబ్లీ వేదికగా కీర్తిస్తున్నరు
- ●వంటగది నుంచి గెరిల్లా దళం దాకా.. ఎవరూ చెప్పని తెలంగాణ ఆడబిడ్డల సాయుధ పోరాట రహస్యాలు!
- ●NTA Examination Calendar | జనవరి 22 నుంచి జేఈఈ మెయిన్-1.. వివిధ పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన ఎన్టీఏ

Ranbir Kapoor | వినాయకుడి ప్రసాదం వద్దన్న బాలీవుడ్ హీరో - బీఫ్ మ్యాన్ అంటూ ట్రోల్స్

Special Trains | ప్రయాణికులకు తీపికబురు..! పెద్ద ఎత్తున ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే..

Amazon Alexa Plus | అమెజాన్ నుంచి అలెక్సా ప్లస్.. ఇక మీ మాటే ఆదేశం..

Hyderabad Liberation Day 2026 | బైరాన్‌పల్లి, నిర్మల్‌లో వెయ్యి మందిని ఉరితీసిన నిజాం రాజును అసెంబ్లీ వేదికగా కీర్తిస్తున్నరు



