త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

INDIA Bloc | ఇండియా కూట‌మి ప‌గ్గాలు మ‌మ‌తా బెన‌ర్జీకి అప్ప‌గించాలి.. మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

Mani Shankar Aiyar, Mamata Banerjee, Rahul Gandhi, INDIA Bloc, INDIA Bloc Chief, Kolkata

D

National | Published On Feb 23, 2026, 11.10 am IST

INDIA Bloc | ఇండియా కూట‌మి ప‌గ్గాలు మ‌మ‌తా బెన‌ర్జీకి అప్ప‌గించాలి.. మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు
Advertisement

INDIA Bloc | కాంగ్రెస్‌ సీనియర్‌ నేత (Congress leader) మణిశంకర్‌ అయ్యర్‌ (Mani Shankar Aiyar).. మరోసారి తన వివాదస్పద వ్యాఖ్యలతో పార్టీని ఇరుకున పెట్టారు. విపక్ష 'ఇండియా' కూటమి (INDIA Bloc) డ్రైవింగ్ సీటు నుంచి త‌ప్పుకోవాల‌ని పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి సూచించారు. ఇండియా ప‌గ్గాల‌ను ప్రాంతీయ పార్టీల నేత‌ల‌కు వ‌దిలేయాల‌న్నారు. అందుకు ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ (Mamata Banerjee) అర్హురాల‌ని పేర్కొన్నారు. ఆమె లేకుంటే ఇండియా కూట‌మి ఉనికికే ప్ర‌మాద‌మంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

కోల్‌క‌తా (Kolkata)లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో అయ్య‌ర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. "ఇండియా కూట‌మి బాధ్య‌త‌ల నుంచి రాహుల్ త‌ప్పుకోవాలి. కూటమి డ్రైవింగ్ సీటును ప్రాంతీయ పార్టీల నేత‌ల‌కు అప్ప‌గించాలి. అందుకు మ‌మ‌తా బెన‌ర్జీ అర్హురాలు. ఆమెతోపాటూ మ‌రో న‌లుగురు కూడా ఈ స్థానానికి అర్హులే. స్టాలిన్‌, అఖిలేష్ యాద‌వ్‌, తేజ‌స్వీ యాద‌వ్ లేదా మ‌రెవరికైనా ఇండియా ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని నేను ఆశిస్తున్నాను" అని మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్ వ్యాఖ్యానించారు.

మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్ వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై బెంగాల్ కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. గతంలో ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసి, పార్టీ నుంచి సస్పెన్షన్ ఎదుర్కొన్న అయ్యర్ బెంగాల్‌లో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాల కోసమే మమతా బెనర్జీని ప్రసన్నం చేసుకునేందుకు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు.

Advertisement
Advertisement