త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Independence Day | ఎర్ర‌కోట‌లో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు.. వ‌రుస‌గా రెండో ఏడాదీ రాహుల్‌, ఖ‌ర్గే గైర్హాజ‌రు

Independence Day | ఢిల్లీలోని ఎర్ర‌కోట‌లో (Red Fort) జ‌రిగిన 80వ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌కు (Independence Day)  కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు మ‌ల్లికార్జున ఖ‌ర్గే (Mallikarjun Kharge), రాహుల్ గాంధీ (Rahul Gandhi) గైర్హాజ‌ర‌య్యారు.

G

National | Published On Aug 15, 2026, 9.58 am IST

Independence Day | ఎర్ర‌కోట‌లో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు.. వ‌రుస‌గా రెండో ఏడాదీ రాహుల్‌, ఖ‌ర్గే గైర్హాజ‌రు
Advertisement

Independence Day | త్రినేత్ర‌.న్యూస్‌: ఢిల్లీలోని ఎర్ర‌కోట‌లో (Red Fort) జ‌రిగిన 80వ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌కు (Independence Day)  కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు మ‌ల్లికార్జున ఖ‌ర్గే (Mallikarjun Kharge), రాహుల్ గాంధీ (Rahul Gandhi) గైర్హాజ‌ర‌య్యారు. లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భలో విప‌క్ష నేత‌లైన ఈ ఇద్ద‌రు నేత‌లు స్వాంతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌కు దూరంగా ఉండ‌టం వ‌రుస‌గా ఇది రెండో ఏడాది.

కార‌ణం ఇదే..

2024లో జ‌రిగిన పంద్రాగ‌స్టు వేడుక‌ల సంద‌ర్భంగా లోక్‌స‌భ‌లో విప‌క్ష నేత (Lok Sabha Opposition Leader) అయిన‌ రాహుల్ గాంధీకి రెండో వ‌రుస‌లో సీటు కేటాయించారు. క్యాబినెట్ మంత్రి హోదాలో ఉన్న ఆయ‌న‌కు సంప్ర‌దాయానికి విరుద్ధంగా వెనుక వ‌రుస‌లో సీటు కేటాయింపుపై ఆ స‌మ‌యంలో విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. దానిని కాంగ్రెస్ ఎంపీని, ప్ర‌జ‌ల‌ను అవ‌మానించ‌డ‌మేన‌ని కాంగ్రెస్ (Congress) పార్టీ విమ‌ర్శించింది. ఈ నేప‌థ్యంలోనే ఇరువురు నేత‌లు అప్ప‌టి నుంచి వేడుక‌లు దూరంగా ఉంటున్నారు. కాగా, ఒలింపియ‌న్ల‌కు ముందు వ‌రుస‌లో సీట్లు కేటాయించ‌డంతోనే రాహుల్‌కు రెండో వ‌రుస‌లో సీటు కేటాయించామ‌ని ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్ల‌డించారు.

Advertisement
Advertisement