ISRO-ESA | భూ పరిశీలన మిషన్ కోసం చేతులు కలిపిన ఇస్రో-ఈసా..
ISRO-ESA | స్పేస్ సైన్స్‌లో అంతర్జాతీయ సహకారం మరింత బలపడుతోంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO), యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) కీలక ఒప్పందంపై సంతకాలు చేశాయి. భూమి పరిశీలన మిషన్లకు సంబంధించిన డేటా పరిశోధన, శాస్త్రీయ అధ్యయనాల్లో పరస్పర సహకారం పెంచుకోవడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం.
ISRO-ESA | స్పేస్ సైన్స్‌లో అంతర్జాతీయ సహకారం మరింత బలపడుతోంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO), యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) కీలక ఒప్పందంపై సంతకాలు చేశాయి. భూమి పరిశీలన మిషన్లకు సంబంధించిన డేటా పరిశోధన, శాస్త్రీయ అధ్యయనాల్లో పరస్పర సహకారం పెంచుకోవడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. ఈ ఒప్పందం ప్రకారం.. ఉపగ్రహాల ద్వారా సేకరించే భూమి సంబంధిత డేటాను కాలిబ్రేషన్, వాలిడేషన్ ప్రక్రియల ద్వారా సంయుక్తంగా విశ్లేషించనున్నారు. భూమి పరిశీలనకు సంబంధించిన శాస్త్రీయ అధ్యయనాలు, పరిశోధనల్లో రెండుసంస్థలు కలిసి పని చేస్తాయి. ఈ ఒప్పందంపై ఇటీవల వర్చువల్ విధానంలో సంతకాలు జరిగాయి. కార్యక్రమానికి ఇస్రో శాస్త్రీయ కార్యదర్శి ఎం గణేశ్ పిల్లై, ఈఎస్ఏ ఎర్త్ ఆబ్జర్వేషన్ డైరెక్టర్ సైమొనెట్టా చెలి పాల్గొన్నారు.
1978 నుంచే భాగస్వామ్యం
భారత్, యూరప్ అంతరిక్ష సంస్థల మధ్య సహకారం కొత్తది కాదు. ఇస్రో–ఈఎస్ఏ భాగస్వామ్యం మొదటిసారిగా 1978లోనే ప్రారంభమైంది. అనంతరం 2002లో ఆ సహకారాన్ని పునరుద్ధరించారు. తాజా ఒప్పందం ద్వారా భవిష్యత్తు అంతరిక్ష మిషన్లలో డేటా పంచుకోవడం, శాస్త్రీయ పరిశోధనల బలోపేతం బలోపేతం చేయడం వంటి అంశాలకు మరింత ఊతమిస్తుందని భావిస్తున్నారు. ఈ భాగస్వామ్యం ఈసా చేపట్టనున్న ఫ్లెక్స్ (Fluorescence Explorer – FLEX) మిషన్‌కు ప్రత్యేకంగా ఉపయోగపడనుంది. ఈ మిషన్ ద్వారా భూమిపై ఉన్న మొక్కలు విడుదల చేసే ఫ్లోరోసెన్స్ సంకేతాలను కొలుస్తారు. ఈ సమాచారం ఆధారంగా మొక్కలు ఎంత సమర్థవంతంగా ఫోటోసింథసిస్ ప్రక్రియను నిర్వహిస్తున్నాయో శాస్త్రవేత్తలు అంచనా వేయనున్నారు. అలాగే, భూమిపై మొక్కల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడం, వాతావరణ మార్పుల ప్రభావాన్ని అర్థం చేసుకోవడం, వ్యవసాయం, పర్యావరణ పరిశీలనను మెరుగుపరచడం, కార్బన్ చక్రంపై మరింత స్పష్టమైన అధ్యయనం చేయడం తదితర అంశాల్లో కీలక సమాచారం లభించనుంది.
సాంకేతిక సహకారం
ఈ ఒప్పందం కింద ఇస్రో, ఈసా పలు సాంకేతిక రంగాల్లో కలిసి పనిచేయనున్నాయి. ఉపగ్రహ డేటా కాలిబ్రేషన్, వాలిడేషన్ ప్రక్రియలను సంయుక్తంగా నిర్వహించనున్నారు. భూమి పరిశీలనకు సంబంధించిన శాస్త్రీయ పరిశోధనల్లో భాగస్వామ్యం వహిస్తారు. అదనంగా గ్రౌండ్ స్టేషన్లు, ట్రాకింగ్ నెట్‌వర్క్‌లకు పరస్పర మద్దతు ఉంటుంది. డేటా విశ్లేషణ, మిషన్ సపోర్ట్ వంటి అంశాల్లో సహకారం పెరగడం ద్వారా అంతరిక్ష డేటా ఖచ్చితత్వం, మరింత మెరుగుపడనుంది. భారత్, యూరప్ అంతరిక్ష సంస్థలు గతంలో కూడా పలు మిషన్లలో కలిసి పనిచేశాయి. చంద్రయాన్, ఆదిత్య ఎల్–1 వంటి భారత అంతరిక్ష మిషన్లకు ఈసా గ్రౌండ్ స్టేషన్, ట్రాకింగ్ సపోర్ట్ అందించింది. మరోవైపు ఇస్రో కూడా తన డీప్ స్పేస్ యాంటెన్నా సదుపాయాల ద్వారా అనేక అంతర్జాతీయ అంతరిక్ష మిషన్లకు సాంకేతిక సహాయం అందించింది.
భవిష్యత్ మిషన్లకు బలం
భవిష్యత్తులో భూమికి సంబంధించిన అనేక కీలక అంతరిక్ష మిషన్లకు ఈ భాగస్వామ్యం ముఖ్యమైన పాత్ర పోషించనుంది. అంతరిక్ష పరిశోధనను బలోపేతం చేయడమే కాకుండా వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయ పరిశోధనలకు సంబంధించిన కొత్త శాస్త్రీయ సమాచారం అందించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతరిక్ష శాస్త్రంలో ప్రపంచ దేశాల మధ్య సహకారం భవిష్యత్తులో మరింత కీలకంగా మారబోతోందని భారత్–యూరప్ భాగస్వామ్యం మరోసారి స్పష్టం చేస్తోంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Malayalam OTT | ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ - సీన్ సీన్‌కో మలుపు
- ●Hardik Pandya | పాండ్యాపై కన్నేసిన చెన్నైకి.. ముంబయి ఇండియన్స్‌తో డీల్‌పై సీఎస్కే ఆసక్తి..!
- ●Archita Sarangi Instagram post | 'ఆ పోస్ట్ నేనెందుకు డిలీట్ చేయాలి?' ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ ఎంపీ కూతురి వైరల్ పోస్ట్
- ●Punjab Paper Leak | పంజాబ్‌లో పేపర్ లీక్ చిచ్చు: విద్యా శాఖ మంత్రి రాజీనామాకు బీజేపీ డిమాండ్
- ●CWG 2026 | గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్.. వెయిట్లిఫ్ట్లో భారత్‌కు సిల్వర్..!
- ●Mrunal Thakur | మృణాల్ తగ్గేదేలే - హిట్లు లేకపోయినా రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచిన బ్యూటీ

Malayalam OTT | ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ - సీన్ సీన్‌కో మలుపు

Hardik Pandya | పాండ్యాపై కన్నేసిన చెన్నైకి.. ముంబయి ఇండియన్స్‌తో డీల్‌పై సీఎస్కే ఆసక్తి..!

Archita Sarangi Instagram post | 'ఆ పోస్ట్ నేనెందుకు డిలీట్ చేయాలి?' ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ ఎంపీ కూతురి వైరల్ పోస్ట్

Punjab Paper Leak | పంజాబ్‌లో పేపర్ లీక్ చిచ్చు: విద్యా శాఖ మంత్రి రాజీనామాకు బీజేపీ డిమాండ్





