Muslim Quota | మహారాష్ట్రలో ముస్లిం కోటా రద్దు.. 11 ఏండ్ల నాటి రిజర్వేషన్లను కొట్టేసిన బీజేపీ సర్కార్
Muslim Quota | విద్య, ఉద్యోగ అవకాశాల్లో ముస్లింలకు 5 శాతం రిజర్వే షన్లను (Muslim Quota) మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra government) రద్దు చేసింది. 2014లో కాంగ్రెస్, ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ రిజర్వేషన్లను రద్దు చేస్తూ బీజేపీ (BJP) సర్కార్ నిర్ణయం తీసుకున్నది.
Muslim Quota | త్రినేత్ర.న్యూస్: విద్య, ఉద్యోగ అవకాశాల్లో ముస్లింలకు 5 శాతం రిజర్వే షన్లను (Muslim Quota) మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra government) రద్దు చేసింది. 2014లో కాంగ్రెస్, ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ రిజర్వేషన్లను రద్దు చేస్తూ బీజేపీ (BJP) సర్కార్ నిర్ణయం తీసుకున్నది. అయితే 12 ఏండ్ల క్రిత ఈ రిజర్వేషన్లను ప్రవేశపెట్టినప్పటికీ ఎప్పుడూ అమలు కాలేదు. 2014లో నాటి పృద్విరాజ్ చౌహాన్ ప్రభుత్వం స్పెషల్ బ్లాక్‌వర్డ్ క్లాస్–ఏ (SBC-A) కేటగిరీ కింద రాష్ట్రంలోని ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తెచ్చింది. అది చట్టరూపం దాల్చకపోవడంతో ఆ రిజర్వేషన్లకు ఎప్పుడో కాలదోషం పట్టింది. కాగా, మరాఠాలకు కూడా 16 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పటికీ.. అది కూడా అమలులోకి రాకుండానే పోయింది. తాజాగా వాటిని ఫడ్నవీస్ ప్రభుత్వం లాంఛనంగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం విశేషం.
దీంతోపాటు ఎస్‌బీసీ–ఏ కేటగిరీ కింద రాష్ట్రంలో ముస్లింలకు కుల, నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్ల జారీని కూడా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ముస్లిం రిజర్వేషన్ల అమలుపై 2014 నవంబర్‌లోనే బాంబే హైకోర్టు స్టే విధించింది. అయితే విద్యా సంస్థల్లో వాటిని అమలు చేసేందుకు మాత్రం అనుమతించింది. కానీ ఆ తర్వాత నెల రోజులకే ఆర్డినెన్స్ కాలపరిమితి ముగిసింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేప ఈనేతృత్వంలో ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ ఆర్డినెన్స్ చట్టరూపం దాల్చలేదు. దీంతో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు కూడా అటకెక్కాయి. అయినా ఈ అంశం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. కోర్టు కూడా ఆ రిజర్వేషన్లు చెల్లవని ప్రకటించింది.
కాగా, ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఫడ్నవీస్ సర్కారు మైనార్టీ వ్యతిరేక ప్రభుత్వమని మాజీ సీఎం పృద్వీరాజ్ చవాన్ విమర్శించారు. అజిత్ మరణించిన తర్వాత ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. నాడు ఆయన ఉపముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రిజర్వేషన్లు కల్పిస్తూ తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు అజిత్ పవార్ పార్టీ (NCP) ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకమా అని మండిపడ్డారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026

N Ramachander Rao | మోదీ నేపథ్యం.. కాంగ్రెస్‌కు ఎప్పుడూ కంటగింపే : ఎన్ రామచందర్ రావు
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



