Lpg Gas Price Hike | బడ్జెట్‌కు ముందు షాక్.. మళ్లీ పెరిగిన గ్యాస్ ధర..!
Lpg Gas Price Hike | బడ్జెట్‌కు ముందు గ్యాస్ వినియోగదారులకు షాక్ తగిలింది. వాణిజ్య సిలిండర్ ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ఢిల్లీలో ఇంతకు ముందు దేశ రాజధాని ఢిల్లీ నగరంలో రూ.1691.50 ఉండగా.. ప్రస్తుతం రూ.50 పెరిగి రూ.1740.50కి చేరింది.
Lpg Gas Price Hike | బడ్జెట్‌కు ముందు గ్యాస్ వినియోగదారులకు షాక్ తగిలింది. వాణిజ్య సిలిండర్ ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ఢిల్లీలో ఇంతకు ముందు దేశ రాజధాని ఢిల్లీ నగరంలో రూ.1691.50 ఉండగా.. ప్రస్తుతం రూ.50 పెరిగి రూ.1740.50కి చేరింది. ఢిల్లీలో రూ. 1,740.50గా, హైదరాబాద్‌లో రూ.1,912.50గా, ముంబయిలో రూ. 1,692.00గా, కోల్‌కతాలో రూ. 1,844.50గా, చెన్నైలో రూ.1,899.50కి చేరింది.
ఇదిలా ఉండగా.. గత బడ్జెట్ రోజున ఎల్‌పీజీ సిలిండర్ ధరలు తగ్గాయి. ఇదిలా ఉండగా.. వరుసగా రెండో నెలలలోనూ వాణిజ్య గ్యాస్ ధరలు పెరిగాయి. దాంతో వ్యాపార వర్గాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సర్వీసులు, చిరు వ్యాపారులపై ప్రభావం పడనున్నది. గత ఏడాది నవంబర్, డిసెంబర్‌లు ధరలు స్వల్పంగా తగ్గినా.. జనవరిలో రూ.111 పెరిగింది. చమురు కంపెనీలు డొమెస్టిక్ గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం 14.2 కిలోల గృహ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.853గా ఉన్నది. దాంతో గృహ వినియోగదారులకు ఊరట లభించినట్లయ్యింది. గతేడాది ఏప్రిల్ నుంచి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






