త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kerala Election Results | ధ‌ర్మదంలో సీఎం విజ‌య‌న్ వెనుకంజ‌.. లీడ్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి..

Kerala Election Results | ధ‌ర్మ‌దం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య్ వెనుకంజ‌లో ఉన్నారు. కాంగ్రెస్ అభ్య‌ర్థి వీపీ అబ్దుల్ ర‌షీద్ ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ మంత్రివర్గంలో కొన‌సాగుతున్న 12 మంది మంత్రులు వెనుకంజ‌లో ఉన్నారు.

P

National | Published On May 4, 2026, 10.44 am IST

Kerala Election Results | ధ‌ర్మదంలో సీఎం విజ‌య‌న్ వెనుకంజ‌.. లీడ్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి..
Advertisement

Kerala Election Results | ధ‌ర్మ‌దం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య్ వెనుకంజ‌లో ఉన్నారు. కాంగ్రెస్ అభ్య‌ర్థి వీపీ అబ్దుల్ ర‌షీద్ ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ మంత్రివర్గంలో కొన‌సాగుతున్న 12 మంది మంత్రులు వెనుకంజ‌లో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. ఏప్రిల్ 9న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం 43 చోట్ల 140 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 140 స్థానాలున్న కేర‌ళ‌లో మ్యాజిక్ ఫిగ‌ర్ 71. ప్ర‌స్తుతం కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 92 స్థానాల్లో ముందంజ‌లో ఉండ‌గా.. ఎల్‌డీఎఫ్ కూట‌మి 42 చోట్ల ఆధిక్యంలో ఉంది. బీజేపీ కేవ‌లం ఒకే స్థానంలో ఆధీక్యంలో ఉంది.

ప్ర‌స్తుత ట్రెండ్స్‌ను ప‌రిశీలిస్తు యూడీఎఫ్ కూట‌మి అధికారం దిశ‌గా ముందుకు సాగుతోంది. ప్ర‌స్తుతం
ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాలు నిజ‌మ‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. సీఎం విజయ‌న్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ కూట‌మి వెనుకంజ‌లో ఉన్న‌ది. మూడోసారి లెఫ్ట్ డెమోక‌ట్రిక్ ఫ్రంట్ మూడోసారి అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. గ‌తంలో కేరళలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్‌ల మధ్య ప్రభుత్వాలు మారుతూ వ‌స్తుండేవి. కానీ, గ‌త ఎన్నిక‌ల్లో విజ‌య‌న్ వ‌రుస‌గా రెండోసారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ సారి హాట్రిక్ విజ‌యంపై క‌న్నేశారు.

Advertisement
Advertisement