Chardham Yatra | రుద్రప్రయాగలో భారీ వర్షాలు.. కేదార్‌నాథ్ యాత్రకు బ్రేక్..!
Chardham Yatra | రుద్రప్రయాగ్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలు కొనసాగే అవకాశం ఉండడంతో వాతావరణశాఖ ఆరెంజ్ అలెర్ట్ చేసింది. ఈ క్రమంలో అధికారులు భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకొని కేదార్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.
Chardham Yatra | రుద్రప్రయాగ్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలు కొనసాగే అవకాశం ఉండడంతో వాతావరణశాఖ ఆరెంజ్ అలెర్ట్ చేసింది. ఈ క్రమంలో అధికారులు భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకొని కేదార్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్రికులు ప్రస్తుతం ఉన్న సమీప హోల్డింగ్ పాయింట్లు, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని జిల్లా పరిపాలన ఆదేశాలు జారీ చేసింది. ప్రతికూల వాతావరణం, ఆరెంజ్ అలర్ట్ కారణంగా యాత్రను నిలిపివేసినట్లు జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రాజ్వార్ తెలిపారు.
అవసరమైన చర్యల కోసం పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, డీడీఆర్‌ఎఫ్ సహా అన్ని సహాయక బృందాలను అప్రమత్తం చేసినట్లు ఆయన వెల్లడించారు. వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న వెంటనే యాత్రను తిరిగి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా జిల్లా కలెక్టర్ విశాల్ మిశ్రా వాతావరణ పరిస్థితులు, యాత్ర మార్గాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సోన్‌ప్రయాగ్, గౌరీకుండ్ సహా సున్నిత ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. వాతావరణం అనుకూలించే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ యాత్రికులను అనుమతించవద్దని సూచించారు. యాత్ర రూట్‌లో పరిస్థితిని కంట్రోల్ రూమ్ నుంచి సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం పరిశీలిస్తూ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.
సంబంధిత వార్తలు

Hyderabad biker | హిమాచల్‌లో హైదరాబాద్ బైక్ రైడర్ అదృశ్యం.. రెండు వారాలైనా లభించని ఆచూకీ
ఆగస్టు 2, 2026

CJI Justice Surya Kant | మధ్యవర్తిత్వం భారతీయ సంస్కృతిలో భాగమే : సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
ఆగస్టు 1, 2026

Sabarimala | శబరిమల అయ్యప్ప భక్తులకు హై అలర్ట్.. భారీ వర్షాలతో దేవస్వం బోర్డు కీలక సూచనలు..
ఆగస్టు 1, 2026
తాజావార్తలు
- ●Nayanthara | టాక్సిక్ కోసం ఇంగ్లీష్‌లో డబ్బింగ్ - నయన్ రూటే సఫరేటు
- ●Harish Rao | బిడ్డా అఖిలా.. నేనున్నా.. నువ్ డాక్టర్ అవ్వు
- ●KTR | వర్షాలు బాగా పడాలే.. రాష్ట్రం పచ్చగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నా
- ●Bhatti Vikramarka | తెలంగాణను ప్రపంచస్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం: భట్టి విక్రమార్క
- ●RS Praveen Kumar | ‘మహా’ ఓనర్ వంశీని ప్రశ్నించే దమ్ము లేదా? పోలీసులకు ఆదేశాలు ఎవరిస్తున్నరు?
- ●Mallu Bhatti Vikramarka | తెలంగాణ అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రపంచ వేదికపై చాటనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Nayanthara | టాక్సిక్ కోసం ఇంగ్లీష్‌లో డబ్బింగ్ - నయన్ రూటే సఫరేటు

Harish Rao | బిడ్డా అఖిలా.. నేనున్నా.. నువ్ డాక్టర్ అవ్వు

KTR | వర్షాలు బాగా పడాలే.. రాష్ట్రం పచ్చగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నా

Bhatti Vikramarka | తెలంగాణను ప్రపంచస్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం: భట్టి విక్రమార్క



