త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NEET Row | డిమాండ్లు మార్చ‌డం సంప్ర‌దాయాల‌కు విరుద్దం.. కాంగ్రెస్‌పై జితేంద్ర‌సింగ్ విమ‌ర్శ‌లు..!

NEET Row | నీట్ అంశంపై కేంద్రం, కాంగ్రెస్ మధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతున్న‌ది. పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ఈ అంశంపై చ‌ర్చించాల‌ని ఆ పార్టీ నేత‌, లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వ‌ర్యంలో నేత‌లు ప్ర‌ధాని నివాసం వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగారు. ఈ వ్య‌వ‌హారంపై కేంద్ర‌మంత్రి డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ విమ‌ర్శ‌లు గుప్పించారు.

P

National | Published On Jul 21, 2026, 7.29 pm IST

NEET Row | డిమాండ్లు మార్చ‌డం సంప్ర‌దాయాల‌కు విరుద్దం.. కాంగ్రెస్‌పై జితేంద్ర‌సింగ్ విమ‌ర్శ‌లు..!
Advertisement

NEET Row | నీట్ అంశంపై కేంద్రం, కాంగ్రెస్ మధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతున్న‌ది. పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ఈ అంశంపై చ‌ర్చించాల‌ని ఆ పార్టీ నేత‌, లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వ‌ర్యంలో నేత‌లు ప్ర‌ధాని నివాసం వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగారు. ఈ వ్య‌వ‌హారంపై కేంద్ర‌మంత్రి డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ విమ‌ర్శ‌లు గుప్పించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితర నేతలు అక్బ‌ర్ రోడ్ స‌మీపంలో ధ‌ర్నా చేశార‌న్నారు.

ప్రభుత్వం తరఫున తాను, కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ వెళ్లి కాంగ్రెస్ నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపామ‌న్నారు. ఆ ప్రాంతంలో నిర‌స‌న‌లకు అనుమ‌తి లేద‌ని, ఆందోళ‌న విర‌మించాల‌ని రాహుల్‌ను కోరాన‌న్నారు. నీట్, సంబంధిత అంశాలపై పార్లమెంట్‌లో చర్చకు ప్రభుత్వం అంగీకరిస్తే నిరసన విరమిస్తానని రాహుల్ చెప్పార‌ని కేంద్రంమంత్రి తెలిపారు. ఆ త‌ర్వాత చ‌ర్చ‌ల‌కు అంగీక‌రించామ‌ని, ఆ త‌ర్వాత విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల‌నే కొత్త డిమాండ్‌ను రాహుల్ తెర‌పైకి తీసుకువ‌చ్చార‌ని ఆరోపించారు. ప్రభుత్వ హామీ తర్వాత డిమాండ్లు మార్చడం ప్రజాస్వామ్యం, సంప్రదాయాలకు విరుద్ధమని విమర్శించారు. నీట్ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కాంగ్రెస్ ఇప్పటివరకు అధికారికంగా చర్చ కోసం నోటీసు ఇవ్వలేదన్నారు. కేంద్ర‌మంత్రి చేసిన వ్యాఖ్య‌ల‌ను కాంగ్రెస్ ఖండించింది.

పార్టీ ఎంపీ జైరాం రమేశ్ మాట్లాడుతూ నీట్ వ్యవహారంపై పార్లమెంట్‌లో హోంమంత్రి ప్రకటన చేయడంతో పాటు సమగ్ర చర్చ జరపాలని తాము డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని, ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్ కొత్తది కాదని, గత 45 రోజులుగా కాంగ్రెస్ ఇదే డిమాండ్ చేస్తోందని జైరాం రమేశ్ స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో చర్చకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని, అందుకే రోడ్డెక్కాల్సి వచ్చిందని కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా పేర్కొన్నారు. మరోవైపు, నీట్ అంశంపై చర్చకు కేంద్రం సిద్ధంగా ఉందని జితేంద్ర సింగ్ పునరుద్ఘాటించారు.

Advertisement
Advertisement