Jaahnavi Kandula | అమెరికాలో జాహ్నవి కందుల మృతి కేసు.. ఆమె కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం
Jaahnavi Kandula | 2023 జనవరిలో అమెరికాలోని సియాటెల్ (Seattle)లో 23 ఏళ్ల భారత విద్యార్థిని జాహ్నవి కందుల (Jaahnavi Kandula) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది.
Jaahnavi Kandula | 2023 జనవరిలో అమెరికాలోని సియాటెల్ (Seattle)లో 23 ఏళ్ల భారత విద్యార్థిని జాహ్నవి కందుల (Jaahnavi Kandula) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. జాహ్నవి కుటుంబానికి 29 మిలియన్ డాలర్లు పరిహారంగా చెల్లించేందుకు సియాటెల్ అంగీకరించింది. అంటే మన భారత కరెన్సీలో రూ. 262 కోట్లన్నమాట. ఈ మేరకు సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు. జాహ్నవి మరణం అత్యంత బాధాకరమని, ఈ సెటిల్మెంట్ ద్వారా బాధితురాలి కుటుంబానికి కొంత మేరకైనా ఊరట లభిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
కేసు నేపథ్యం ఇదీ..
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి కందుల నార్త్‌ఈస్ట్రన్ విశ్వవిద్యాలయంలో మాస్టర్ డిగ్రీ చేయడానికి 2021లో అమెరికా వెళ్లారు. అయితే, 2023, జనవరి 23న ఆమె రోడ్డు దాటుతున్నప్పుడు అతి వేగంతో దూసుకొచ్చిన పోలీస్ పెట్రోలింగ్ వాహనం జాహ్నవిని ఢీ కొట్టింది. దీంతో ఆమె 100 అడుగుల దూరం ఎగిరి పడింది. అదే రోజు రాత్రి ఆమె మృతి చెందింది. పోలీస్ ఆఫీసర్ కెవిన్ డవే (Kevin Dave) నిర్లక్ష్యం, కారు ఓవర్ స్పీడ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాఫ్తులో తేలింది.
ఇక ఈ కేసు దర్యాప్తుపై పోలీస్ అధికారి మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అయింది. ‘ఆమె ఓ సాధారణ వ్యక్తి. ఆమె చావుకు విలువ లేదు’ అన్నట్టు చులకనగా ఆయన మాట్లాడారు. ఈ వీడియో బయటకు రావడంతో అమెరికా అధికారుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం కూడా డిమాండ్ చేసింది.
అంతేకాదు, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి.. నిర్లక్ష్యంగా వాహనం నడిపి విద్యార్థిని మరణానికి కారణమైన కెవిన్ డవేపై చట్టప్రకారం చర్యలు తీసుకోవలని కూడా ప్రభుత్వం ఒత్తిడి చేసింది. భారత్ ఒత్తిడితో కింగ్ కౌంటీ విచారణ చేసింది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు కెవిన్‌కు 5 వేల డాలర్ల జరిమానా విధించింది. ఆ తర్వాత ఆ పోలీసును ఉద్యోగం నుంచి కూడా తొలగించారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




