త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Student | అమెరికాలో భార‌తీయ విద్యార్థి మిస్సింగ్‌.. ఐదు రోజులుగా గాలింపు

Indian Student | అమెరికాలో ఇండియ‌న్ స్టూడెంట్ మిస్సింగ్ కేసు ప్ర‌స్తుతం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. కాలిఫోర్నియా (California) వ‌ర్సిటీలో చ‌దువుతున్న క‌ర్ణాట‌క రాష్ట్రానికి చెందిన 22 ఏళ్ల సాకేత్ (Saketh Sreenivasaiah) ఐదు రోజులుగా క‌నిపించ‌కుండా పోయాడు. విద్యార్థి కోసం అధికారులు గాలింపు చేప‌డుతున్నారు.

D

National | Published On Feb 14, 2026, 10.33 am IST

Indian Student | అమెరికాలో భార‌తీయ విద్యార్థి మిస్సింగ్‌.. ఐదు రోజులుగా గాలింపు
Advertisement

Indian Student | అమెరికాలో భార‌త విద్యార్థుల (Indian Student) మిస్సింగ్ కేసులు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఇప్ప‌టికే చాలా మంది ఉన్న‌త చ‌దువుల‌కోసం వెళ్లి అక్క‌డ అదృశ్యం అయిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రో ఇండియ‌న్ స్టూడెంట్ మిస్సింగ్ కేసు ప్ర‌స్తుతం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.

కర్ణాటక (Karnataka) రాష్ట్రానికి చెందిన సాకేత్ శ్రీ‌నివాస‌య్య (Saketh Sreenivasaiah) (22) ఐఐటీ-మద్రాస్‌లో బీటెక్ పూర్తి చేసి.. ఉన్న‌త చ‌దువుల కోసం అమెరికా వెళ్లాడు. కాలిఫోర్నియా (California)లోని ప్రతిష్ఠాత్మక బర్కిలీ విశ్వవిద్యాలయంలో కెమికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు. అయితే, అత‌డు ఫిబ్ర‌వ‌రి 9వ తేదీ నుంచి కనిపించ‌కుండా పోయాడు. సాకేత్ చివరిసారిగా బర్కిలీ హిల్స్‌లోని లేక్ అంజా సమీపంలో కనిపించినట్లు అధికారులు తెలిపారు. అతని పాస్‌పోర్ట్, ల్యాప్‌టాప్‌తో కూడిన బ్యాగ్‌ను ఓ ఇంటి ముందు గుర్తించడం గమనార్హం.

ఈ ఘ‌ట‌న‌పై స్థానిక అధికారులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. సాకేత్ కోసం గాలింపు చేప‌ట్టారు. బర్కిలీ హిల్స్ ప్రాంతాన్ని జ‌ల్లెడ ప‌డుతున్నారు. ఐదు రోజులుగా గాలింపు చేప‌డుతున్నా అత‌డి ఆచూకీ మాత్రం ల‌భ్యం కావ‌డం లేదు. దీంతో సాకేత్ ఫ్రెండ్స్ సోష‌ల్ మీడియాలో కూడా పోస్టు పెట్టారు. అత‌డి ఆచూకీ తెలిస్తే స‌మాచారం ఇవ్వాల‌ని ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో పోస్టులు చేస్తున్నారు. మ‌రోవైపు ఈ ఘటనపై శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. సాకేత్ అదృశ్యం పట్ల ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. అతడి కుటుంబ సభ్యులతోనూ, స్థానిక అధికారులతోనూ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

Advertisement
Advertisement