Indian Student | అమెరికాలో తప్పిపోయిన భారతీయ విద్యార్థి మృతి..
Indian Student | మద్రాస్ ఐఐటీలో (IIT Madras) బీటెక్ పూర్తిచేశాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. శాశ్వతంగా తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. గత వారం రోజులుగా కనిపించకుండా పోయిన భారతీయ విద్యార్థి (Indian Student) సాకేత్ శ్రీనివాసయ్య (Saketh Sreenivasaiah) మృతిచెందారు
International | Published On Feb 15, 2026, 8.32 am IST
Indian Student | త్రినేత్ర.న్యూస్: మద్రాస్ ఐఐటీలో (IIT Madras) బీటెక్ పూర్తిచేశాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. శాశ్వతంగా తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. గత వారం రోజులుగా కనిపించకుండా పోయిన భారతీయ విద్యార్థి (Indian Student) సాకేత్ శ్రీనివాసయ్య (Saketh Sreenivasaiah) మృతిచెందారు. ఈ మేరకు శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. సాకేత్ మృతదేహం లభించినట్లు తెలిపింది.
కర్ణాటక (Karnataka)కు చెందిన సాకేత్ శ్రీనివాసయ్య (22) ఐఐటీ-మద్రాస్‌లో కెమికల్ ఇంజినీరింగ్ డిగ్రీ 2025లో పూర్తి చేశారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. బర్కిలీలోని (Berkeley) యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (University of California)లో ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు. అయితే, అతడు ఫిబ్రవరి 9వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. సాకేత్ చివరిసారిగా బర్కిలీ హిల్స్‌లోని లేక్ అంజా సమీపంలో కనిపించినట్లు అధికారులు తెలిపారు. అతని పాస్‌పోర్ట్, ల్యాప్‌టాప్‌తో కూడిన బ్యాగ్‌ను ఓ ఇంటి ముందు లభించిందన్నారు. దీంతో గత ఆరు రోజులుగా గాలిస్తున్న అధికారులు.. శనివారం అతని మృతదేహాన్ని గుర్తించారు.
సాకేత్ మృతిపట్ల శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం సంతాపం తెలిపింది. అతని కుటుంబానికి అన్నివిధాలు సహాయసహకారాలు అందిస్తామని వెల్లడించింది. సాకేత్ మృతదేహం లభించిందని స్థానిక పోలీసులు వెల్లడించారని పేర్కొంది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






