త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Iran Unrest | మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త‌త‌లు.. మ‌ధ్య‌వ‌ర్తిత్వానికి సిద్ధ‌మ‌న్న పుతిన్‌..!

Iran Unrest | మ‌ధ్య‌ప్రాచ్యంలో ఉద్రిక్త‌త‌లు పెరుగుతున్నాయి. ఈ క్ర‌మంలో ఉద్రిక్త‌త‌ల‌ను త‌గ్గించేందుకు ర‌ష్యా ముందుకు వ‌చ్చింది. దౌత్య ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేసింది. ఈ మేర‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ మొద‌ట ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజిమిన్ నెత‌న్యాహుతో ఫోన్‌లో సంభాషించారు.

P

International | Published On Jan 16, 2026, 6.08 pm IST

Iran Unrest | మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త‌త‌లు.. మ‌ధ్య‌వ‌ర్తిత్వానికి సిద్ధ‌మ‌న్న పుతిన్‌..!
Advertisement

Iran Unrest | మ‌ధ్య‌ప్రాచ్యంలో ఉద్రిక్త‌త‌లు పెరుగుతున్నాయి. ఈ క్ర‌మంలో ఉద్రిక్త‌త‌ల‌ను త‌గ్గించేందుకు ర‌ష్యా ముందుకు వ‌చ్చింది. దౌత్య ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేసింది. ఈ మేర‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ మొద‌ట ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజిమిన్ నెత‌న్యాహుతో ఫోన్‌లో సంభాషించారు. ఆ త‌ర్వాత ఇరాన్ అధ్య‌క్షుడితో మాట్లాడారు. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉద్రిక్త‌త‌ల‌ను త‌గ్గించి, ప‌రిస్థితులు సాధార‌ణ స్థితికి చేరుకునేందుకు దౌత్య ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని క్రెమ్లిన్ తెలిపింది. మధ్యప్రాచ్యం, ఇరాన్‌లో ఉద్రిక్తతలను తగ్గించడంలో పుతిన్ చురుగ్గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ర‌ష్యా పేర్కొంటున్న‌ది. ప‌రిస్థితుల‌ను శాంతిప‌జేసేందుకు పుతిన్ కృషి చేస్తున్న‌ట్లుగా క్రెమ్లిన్ ప్ర‌తినిధి డిమిత్రి పెస్కోవ్ పేర్కొన్నారు. నెతన్యాహుతో చర్చల‌తో రష్యా మధ్యవర్తిత్వాన్ని పుతిన్ ప్రతిపాదించారు. భద్రత, స్థిరత్వానికి రాజకీయ చ‌ర్చ‌లే ఉత్త‌మ మార్గ‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

నెతన్యాహుకు పుతిన్ మధ్యప్రాచ్యం, ఇరాన్‌లోని పరిస్థితిపై వివరంగా చర్చించారు. ప్రాంతీయ భద్రతను నిర్ధారించేందుకు చేస్తున్న దౌత్య ప్ర‌య‌త్నాల‌ను వేగ‌వంతం చేసేందుకు ర‌ష్యా మ‌ద్ద‌తు ఉంటుంద‌ని పుతిన్ స్ప‌ష్టం చేశారు. సైనిక ఘర్షణను నివారించడం అన్ని పార్టీల ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుందని ఆయ‌న తెలిపారు. రాజ‌కీయ‌, దౌత్య ప‌రిష్కారాల‌కు ర‌ష్యా ప్రాధానం ఇస్తుంద‌ని, ఉద్రిక్త‌త‌ల‌ను త‌గ్గించే విష‌యంలో మ‌ధ్య‌వ‌ర్తి పాత్ర‌ను పోషించేందుకు ర‌ష్యా అంగీకారం తెలిపింది. ప్రాంతీయ భద్రత, స్థిర‌త్వ‌మే త‌మ ప్రాధాన్య‌త‌ని ర‌ష్యా అధ్య‌క్షుడు పేర్కొన్నారు. సైనిక ఉద్రిక్త‌త‌ల‌ను నివారించేందుకు స్ప‌ష్ట‌మైన సందేశాన్ని ఇచ్చారు. రెండు వైపులా ప్ర‌త్య‌క్షంగా చ‌ర్చ‌లు జ‌రుపాల‌ని సూచించారు. ఇరాన్ అధ్య‌క్షుడితో ఫోన్‌లో మాట్లాడుతూ రెండు వైపులా ర‌ష్యా మ‌ధ్య‌వ‌ర్తిత్వం ఉంటుంద‌ని పేర్కొన్నారు. చ‌ర్చ‌ల ద్వారా వివాదానికి ముగింపు ప‌ల‌క‌వ‌చ్చ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement