Bullet Train | వచ్చే ఏడాది పట్టాలపైకి బుల్లెట్ రైలు
Bullet Train | భారత్ సొంతంగా తయారు చేస్తున్న తొలి బుల్లెట్ ట్రైన్ దూసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. దేశీయంగా తయారవుతున్న ఈ రైలుకు సంబంధించిన బాడీ ఫ్రేమ్ సిద్ధమైనట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వచ్చే ఏడాది మే, జూన్‌లో దేశీయ బుల్లెట్ ట్రైన్‌తో ట్రాక్‌పై పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
- ట్రైన్ బాడీ ఫ్రేమ్ వర్క్ పూర్తి
- మే, జూన్‌లో ట్రయల్స్
- కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Bullet Train | భారత్ సొంతంగా తయారు చేస్తున్న తొలి బుల్లెట్ ట్రైన్ దూసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. దేశీయంగా తయారవుతున్న ఈ రైలుకు సంబంధించిన బాడీ ఫ్రేమ్ సిద్ధమైనట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వచ్చే ఏడాది మే, జూన్‌లో దేశీయ బుల్లెట్ ట్రైన్‌తో ట్రాక్‌పై పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మంగళవారం వడోదరలో జరిగిన ‘నమో ఫర్ వికసిత్ భారత్’ కార్యక్రమంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రూ.35 వేల కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఇందులో వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (WDFC)లోని మూడు కీలక విభాగాలతో పాటు రైల్వే, హైవే ప్రాజెక్టులు ఉన్నాయి. దేశీయ బుల్లెట్ ట్రైన్ బాడీ ఫ్రేమ్ రెండు రోజుల క్రితమే పూర్తయిందని, ప్రస్తుతం స్క్వీజ్ టెస్టుకు పంపినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. వచ్చే ఏడాది మే లేదా జూన్ నాటికి రైలును పట్టాలపై పరీక్షలకు సిద్ధం చేస్తామని చెప్పారు. రెండు నుంచి నాలుగు నెలల పాటు పరీక్షలు నిర్వహించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బుల్లెట్ ట్రైన్‌ను ప్రారంభిస్తామని వెల్లడించారు. ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్‌లో భాగంగా ఈ ప్రాజెక్టు కొనసాగుతోంది. వడోదర నుంచి ముంబైకి బుల్లెట్ ట్రైన్‌లో ప్రయాణ సమయం సుమారు గంటన్నర మాత్రమే ఉంటుందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఈ కారిడార్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
ఇదిలా ఉండగా.. ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్‌లో సూరత్–బిలిమోరా మధ్య తొలి ఆపరేషనల్ సెక్షన్‌ను వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మిగిలిన మార్గాన్ని దశలవారీగా ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొత్తం కారిడార్ అందుబాటులోకి వస్తే ముంబై–అహ్మదాబాద్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ఇక దాద్రి–జేఎన్‌పీటీ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ గురించి కూడా అశ్విని వైష్ణవ్ ప్రస్తావించారు. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ హైవే ప్రాజెక్టుతోపాటే ఈ కారిడార్ ఆలోచనకు రూపకల్పన జరిగిందని తెలిపారు. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి ఫ్రైట్ కారిడార్‌లో ఒక్క కిలోమీటర్ పనులు కూడా పూర్తికాలేదని పేర్కొన్నారు. నిధులు, డిజైన్, భూసేకరణ వంటి సమస్యలను పరిష్కరించి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లినట్లు వివరించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

G2 Movie | ‘జీ2’లో అడివి శేష్‌కు జోడీగా ఫస్ట్ ఛాయిస్ వామికా కాదట.. ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరంటే?
సెప్టెంబర్ 8, 2026

Shruti Haasan | స్టైలిష్ లుక్‌లో శ్రుతి హాసన్.. నెట్టింట ఫొటోలు వైరల్..
సెప్టెంబర్ 8, 2026

Anaswara Rajan | చిరంజీవి కూతురిగా అనస్వర రాజన్.. ‘కాకా’ ఫస్ట్ లుక్ విడుదల
సెప్టెంబర్ 8, 2026
తాజావార్తలు
- ●Canada | కెనడా ఎదురుదెబ్బ.. అమెరికా ఉత్పత్తులపై భారీ టారిఫ్‌లు..
- ●Revanth meets Gaddam Prasad | స్పీకర్‌కు రేవంత్, భట్టి ఓదార్పు
- ●G2 Movie | ‘జీ2’లో అడివి శేష్‌కు జోడీగా ఫస్ట్ ఛాయిస్ వామికా కాదట.. ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరంటే?
- ●Shruti Haasan | స్టైలిష్ లుక్‌లో శ్రుతి హాసన్.. నెట్టింట ఫొటోలు వైరల్..
- ●Teenmar Mallanna | మా దళిత బిడ్డ కూర్చుంటే కళ్లు మండుతున్నయ్: తీన్మార్ మల్లన్న
- ●KTR and Harish Rao Arrest | ఎర్రవల్లి వద్ద హైటెన్షన్: 'ఎవడ్రా నువ్వు' అంటూ పోలీసుల జులుం.. కేటీఆర్, హరీష్ రావుల అరెస్ట్

Canada | కెనడా ఎదురుదెబ్బ.. అమెరికా ఉత్పత్తులపై భారీ టారిఫ్‌లు..

Revanth meets Gaddam Prasad | స్పీకర్‌కు రేవంత్, భట్టి ఓదార్పు

G2 Movie | ‘జీ2’లో అడివి శేష్‌కు జోడీగా ఫస్ట్ ఛాయిస్ వామికా కాదట.. ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరంటే?

Shruti Haasan | స్టైలిష్ లుక్‌లో శ్రుతి హాసన్.. నెట్టింట ఫొటోలు వైరల్..



