Agni-3 Missile | అగ్ని-3 బాలిస్టిక్ మిస్సైల్ టెస్ట్ విజయవంతం..!
Agni-3 Missile | భారత్ శుక్రవారం మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని-3’ను విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి నిర్వహించారు. ఈ క్షిపణికి సంబంధించిన అన్ని ఆపరేషన్, సాంకేతిక ప్రమాణాలు పూర్తిగా చేరుకుంది. ఈ ప్రయోగాన్ని దేశంలోని వ్యూహాత్మక అణు ఆస్తులను పర్యవేక్షించే స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అగ్ని-3 అనేది అణ్వాయుధ సామర్థ్యం గల మధ్యశ్రేణి బాలిస్టిక్ మిస్సైల్. భారత నౌకాదళం స్వదేశీంగా అభివృద్ధి చేసింది. ఈ క్షిపణి 3వేల నుంచి 3,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించే సామర్థ్యం ఉన్నది.
పాకిస్తాన్‌తో పాటు చైనా సగం వరకు మిస్సైల్ రేజ్ ఉంటుంది. ఈ క్షిపణి పరిమాణం కూడా చాలా పెద్దది. ఇది 17 మీటర్లు పొడవు, 2 మీటర్లు వ్యాసం కలిగి ఉండి, ఒక సెకనులో ఐదు కిలోమీటర్ల దూరం దూసుకెళ్తుంది. 50 టన్నుల బరువున్న ఈ క్షిపణి ఘన ఇంధనంతో పనిచేసే రెండు దశల ఇంజిన్ ఉంటుంది. ఈ క్షిపణి 1.5 టన్నుల బరువున్న వార్‌హెడ్‌ను మోసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంది. ఈ క్షిపణి రెండు దశల ఘన ఇంధన వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. మొదటి దశ ఇంధనం పూర్తిగా దగ్ధమైన తర్వాత రెండో దశ ప్రారంభమవుతుంది. ఇటీవల అగ్ని శ్రేణికి చెందిన ఇతర క్షిపణుల అప్‌గ్రేడ్ వేరియంట్లను పరీక్షించింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్





