Electricity Demand | దేశంలో రికార్డు విద్యుత్ వినియోగం
త్రినేత్ర.న్యూస్: భారతదేశ చరిత్రలోనే ఈ నెల 25న 3.38 నిమిషాలకు అత్యధిక విద్యుత్ డిమాండ్ నెలకొంది. 256.1 గిగావాట్ల విద్యుత్ డిమాండ్‌ను ఎలాంటి కొరత లేకుండా విజయవంతంగా తీర్చడంతో పాటు, ఇప్పటికే పొరుగుదేశాలకు ఎగుమతి చేస్తున్న విద్యుత్ ఎగుమతులను యథావిధిగా కొనసాగడం విశేషం.
Electricity Demand | త్రినేత్ర.న్యూస్: భారతదేశ చరిత్రలోనే ఈ నెల 25న మధ్యాహ్నం మూడు గంటల 38 నిమిషాలకు అత్యధిక విద్యుత్ డిమాండ్ నెలకొంది. 256.1 గిగావాట్ల విద్యుత్ డిమాండ్‌ను ఎలాంటి కొరత లేకుండా విజయవంతంగా తీర్చడంతో పాటు, ఇప్పటికే పొరుగుదేశాలకు ఎగుమతి చేస్తున్న విద్యుత్ ఎగుమతులను యథావిధిగా కొనసాగడం విశేషం. గతంలో 2024 మే 30న 250 గిగావాట్ల అత్యధిక డిమాండ్‌ను ప్రస్తుత డిమాండ్ అధిగమించింది. దేశంలో వేసవి కాలంలో ఒకవైపు ఎండలు మండిపోతుండడంతో అందుకు తగ్గట్లుగానే విద్యుత్ వినియోగం అధికమైంది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే విద్యుత్ వినియోగం 8.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 65 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం పెంపుతోనే ఇది సాధ్యమైందని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. నూతనంగా అందుబాటులోకి వచ్చిన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో కలిసి ప్రస్తుతం 270 గిగావాట్ల డిమాండ్‌ను తీర్చగలిగే సామర్థ్యం మన దేశ సొంతమని పేర్కొన్నాయి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!
- ●Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..
- ●Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!

Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత

Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..

Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ




