త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CBSE | విద్యార్థులూ.. మూడు ప‌రీక్ష‌లు రాయ‌కుంటే అంతే…. సీబీఎస్ఈ గైడ్‌లైన్స్ ఇవే..

CBSE | ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులు (10th Students) మొద‌టి బోర్డు ప‌రీక్ష‌కు త‌ప్ప‌నిస‌రిగా హాజ‌రు కావాల‌ని సీబీఎస్ఈ (CBSE) స్ప‌ష్టం చేసింది. ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చిన 'రెండు బోర్డు పరీక్షల' విధానంపై బోర్డు స్పష్టతనిచ్చింది. మొద‌టి ప‌రీక్ష‌కు హాజ‌రు కాలేనివారిని రెండో బోర్డు ప‌రీక్ష‌కు అనుమ‌తించాలంటూ విన‌తులు వ‌చ్చిన నేప‌థ్యంలో బోర్డు (Board) స్ప‌ష్ట‌త‌నిచ్చింది.

S

National | Published On Feb 17, 2026, 3.25 pm IST

CBSE | విద్యార్థులూ.. మూడు ప‌రీక్ష‌లు రాయ‌కుంటే అంతే…. సీబీఎస్ఈ గైడ్‌లైన్స్ ఇవే..
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులు (Students) మొద‌టి బోర్డు ప‌రీక్ష‌కు త‌ప్ప‌నిస‌రిగా హాజ‌రు కావాల‌ని సీబీఎస్ఈ (CBSE) స్ప‌ష్టం చేసింది. ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చిన 'రెండు బోర్డు పరీక్షల' విధానంపై బోర్డు స్పష్టతనిచ్చింది. మొద‌టి ప‌రీక్ష‌కు హాజ‌రు కాలేనివారిని రెండో బోర్డు ప‌రీక్ష‌కు అనుమ‌తించాలంటూ విన‌తులు వ‌చ్చిన నేప‌థ్యంలో బోర్డు (Board) స్ప‌ష్ట‌త‌నిచ్చింది. మొద‌టి ప‌రీక్ష‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులు సామాన్య‌శాస్త్రం, గ‌ణితం, సామాజిక శాస్త్రం, లాంగ్వేజెస్‌లో మార్కుల (Marks) పెంపున‌కు రెండో ప‌రీక్ష‌కు హాజ‌రు కావ‌చ్చ‌ని తెలిపింది.

- మొదటి విడత (First phase) పరీక్షల్లో 3 లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు రాయకపోతే రెండో విడత (Second phase) కు అనర్హులుగా పరిగణిస్తారు. అలాంటి విద్యార్థుల‌ను ‘ఎసెన్షియ‌ల్ రిపీట్’ వ‌ర్గంలో చేర్చి వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో నిర్వ‌హించే ప్ర‌ధాన ప‌రీక్ష‌ల‌కు హాజ‌రయ్యేలా అవ‌కాశం కల్పిస్తున్న‌ట్లు తెలిపింది. మొద‌టి ప‌రీక్ష‌లో ఒక‌టి రెండు స‌బ్జెక్టుల్లో ఫెయిలైన‌వారిని ‘కంపార్ట్‌మెంట్’ కేట‌గిరీలో ఉంచుతారు. రెండో ఎడిష‌న్‌లో ప‌రీక్ష రాయ‌డానికి ఈ విద్యార్థుల‌కు అవ‌కాశం ఉంటుందని తెలిపింది.  ‘స్టాండ్‌-అలోన్’ స‌బ్జెక్టుల‌కు అవ‌కాశం లేద‌ని పేర్కొంది.

- వివిధ కార‌ణాల వ‌ల్ల ప్రధాన ప‌రీక్ష‌లో మూడు లేదా అంత‌కంటే ఎక్కువ సబ్జెక్టులకు హాజ‌రు కాలేక‌పోతే రెండో బోర్డు ప‌రీక్ష‌ల‌కు అనుమ‌తి ఉండ‌ద‌ని సీబీఎస్ఈ స్ప‌ష్టం చేసింది. దీనిపై వ‌చ్చే విన‌తుల‌ను కూడా ప‌రిశీలించ‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది.

 

Advertisement
Advertisement