త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Madras High Court | చిక్కుల్లో మాజీ మంత్రి బాలాజీ.. ట్రాన్స్‌ఫార్మ‌ర్ల కుంభ‌కోణంలో సీబీఐ ద‌ర్యాప్తుకు హైకోర్టు ఆదేశం..!

Madras High Court | రూ.397 కోట్ల ట్రాన్స్‌ఫార్మర్ కుంభకోణంపై మద్రాస్ హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. కేసు విచార‌ణ కోసం రెండువారాల్లో బృందాన్ని ఏర్పాటు చేయాల‌ని సీబీఐకి సూచించింది. స‌హ‌క‌రించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వంతో పాటు విజిలెన్స్‌ల‌కు విజ్ఞ‌ప్తి చేసింది. విచార‌ణ‌తో మాజీ మంత్రి సెంటిల్ బాలాజీ చిక్కుల్లో ప‌డే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

P

National | Published On Apr 29, 2026, 1.28 pm IST

Madras High Court | చిక్కుల్లో మాజీ మంత్రి బాలాజీ.. ట్రాన్స్‌ఫార్మ‌ర్ల కుంభ‌కోణంలో సీబీఐ ద‌ర్యాప్తుకు హైకోర్టు ఆదేశం..!
Advertisement

Madras High Court | రూ.397కోట్ల ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోళ్ల కుంభ‌కోణంలో మ‌ద్రాస్ హైకోర్టు సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించింది. ఈ నిర్ణయం తమిళనాడు మాజీ విద్యుత్ శాఖ మంత్రి వీ సెంథిల్ బాలాజీ చిక్కుల్లో ప‌డే అవ‌కాశం ఉంది. 2021 నుంచి 2023 మధ్య ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసును స్వతంత్ర సంస్థతో విచారించాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ ఎస్ఏ ధర్మాధికారి, జస్టిస్ జీ అరుల్ మురుగన్ ధర్మాసనం ఈ కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను తమిళనాడు విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ విభాగం సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది.

రెండు వారాల్లోగా సీబీఐ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కూడా సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం, విజిలెన్స్ విభాగం సీబీఐ దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని, అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆరోపణలు తీవ్రమైనవని, రాజ‌కీయాల నేప‌థ్యంలో వాటిని పక్కన పెట్టలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ఎన్జీవో అరప్పోర్ అయ్యక్కం సహా ప్రతిపక్ష నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం మాజీ మంత్రిపై కఠిన చర్యలు తీసుకోవడం లేదని పిటిషన్‌లో ఆరోపించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండించింది. ఇదిలా ఉండగా, ఈ కేసులో ఇప్పటికే సెంథిల్ బాలాజీ కొద్దిరోజుల పాటు జైలులో ఉన్న విషయం తెలిసిందే. తాజా కోర్టు ఉత్తర్వుల నేప‌థ్యంలో మంత్రి ఇబ్బందులు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement