త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SSC CGL Notification | నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌.. 12,256 ఉద్యోగాల‌తో నోటిఫికేషన్ విడుద‌ల చేసిన‌ SSC CGL

SSC CGL Notification | నిరుద్యోగుల‌కు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ సీజీఎల్ తీపి క‌బురు అందించింది. 12,256 ఉద్యోగ ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. అర్హ‌త‌, ఆసక్తి ఉన్న అభ్య‌ర్థులు జూన్ 22 లోపు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

S

National | Published On May 24, 2026, 6.19 pm IST

SSC CGL Notification | నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌.. 12,256 ఉద్యోగాల‌తో నోటిఫికేషన్ విడుద‌ల చేసిన‌ SSC CGL
Advertisement

SSC CGL Notification | త్రినేత్ర‌.న్యూస్‌: నిరుద్యోగుల‌కు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ సీజీఎల్ తీపి క‌బురు అందించింది. 12,256 ఉద్యోగ ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. 2026 నోటిఫికేషన్ ద్వారా గెజిటెడ్‌ & నాన్‌ గెజిటెడ్‌ గ్రూప్‌-బీ, గ్రూప్‌-సీ పోస్టుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. అర్హ‌త‌, ఆసక్తి ఉన్న అభ్య‌ర్థులు జూన్ 22 లోపు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్: బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు 12వ తరగతి స్థాయిలో గణితంలో 60 శాతం మార్కులు ఉండాలి. లేదా డిగ్రీ స్థాయిలో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా ఉండాలి
స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-II: స్టాటిస్టిక్స్, గణితం, ఎకనామిక్స్ మొదలైన సబ్జెక్టులలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, కానీ 1-8-2026 నాటికి ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు పరిమితి: 1-8-2026 నాటికి పోస్టులను బట్టి వయోపరిమితి 18 నుంచి 27 ఏళ్లు, 20 నుంచి 30 ఏళ్లు, 18 నుంచి 30 ఏళ్లు, & 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఇవీ ముఖ్య‌ వివ‌రాలు..

మొత్తం ఖాళీలు: 12,256 పోస్టులు (గెజిటెడ్‌ & నాన్‌ గెజిటెడ్‌ గ్రూప్‌-బీ, సీ)
విద్యార్హత: ఇంటర్‌ లేదా డిగ్రీ పాసైన‌ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు
దరఖాస్తు స‌మ‌ర్పించే విధానం: ఆసక్తి ఉన్న‌ అభ్యర్థులు ఆన్‌లైన్ లోనే దరఖాస్తులను సమర్పించాలి
చివరి తేదీ: ఆన్‌లైన్ దరఖాస్తుకు వ‌చ్చే నెల‌ 22 చివ‌రి తేదీగా ప్ర‌క‌టించారు
ఫీజు వివరాలు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ (EWS) అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ (PWBD), మహిళలు & ఎక్స్‌సర్వీస్‌ మెన్‌ అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం: టైర్‌-1 కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT), టైర్‌-2 కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT), డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ (ధ్రువపత్రాల పరిశీలన)

వెబ్‌సైట్: https://ssc.gov.in

 

Advertisement
Advertisement