New CDS | భారత కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన జనరల్ ఎన్‌ఎస్ రాజా సుబ్రమణి
New CDS | భారత కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా జనరల్ ఎన్‌ఎస్ రాజా సుబ్రమణి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. పాకిస్తాన్, చైనా వ్యవహారాలపై లోతైన అవగాహన కలిగిన సైనికాధికారిగా గుర్తింపు పొందిన ఆయన.. సైన్యంలో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న “మిలిటరీ థియేటరైజేషన్” ప్రణాళిక అమలు, మూడు దళాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నారు.
New CDS | భారత కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా జనరల్ ఎన్‌ఎస్ రాజా సుబ్రమణి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. పాకిస్తాన్, చైనా వ్యవహారాలపై లోతైన అవగాహన కలిగిన సైనికాధికారిగా గుర్తింపు పొందిన ఆయన.. సైన్యంలో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న “మిలిటరీ థియేటరైజేషన్” ప్రణాళిక అమలు, మూడు దళాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నారు. ఈ పదవిలో ఆయన జనరల్ అనిల్ చౌహాన్ స్థానంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన సీడీఎస్‌లుగా పనిచేసిన దివంగత జనరల్ బిపిన్ రావత్, జనరల్ అనిల్ చౌహాన్ అందించిన నాయకత్వం, సేవలను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. దేశ అత్యున్నత సైనికాధికారిగా పనిచేసిన జనరల్ చౌహాన్ శనివారం పదవీ విరమణ చేశారు. సీడీఎస్‌గా నియమితులయ్యే ముందు రాజా సుబ్రమణి జాతీయ భద్రతా మండలి కార్యదర్శిత్వం (ఎన్‌ఎస్‌సీఎస్)లో మిలిటరీ అడ్వైజర్‌గా పనిచేశారు. గత ఏడాది జూలై 31న ఆయన ఆర్మీ వైస్ చీఫ్ పదవి నుంచి పదవీ విరమణ చేశారు.
సాయుధ దళాల్లో సంస్కరణలకే తొలి ప్రాధాన్యం
బాధ్యతలు స్వీకరించిన అనంతరం తన ప్రాధాన్య అంశాలను జనరల్ సుబ్రమణి వెల్లడించారు. సాయుధ దళాల్లో రూపాంతరం, సంస్థాగత సంస్కరణల అమలే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రధానమంత్రి ప్రతిపాదించిన జేఏఐ (జాయింట్‌నెస్, ఆత్మనిర్భరత, ఇన్నోవేషన్) దృష్టికోణాన్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఆర్మి, నౌకాదళం, వాయుసేన సిబ్బంది శిక్షణ, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. దేశ భద్రతకు ఆత్మనిర్భరతే మూలస్తంభమని, స్వదేశీ ఆయుధాల అభివృద్ధి, సైన్యంలో వాటి వినియోగాన్ని వేగవంతం చేస్తామని చెప్పారు. సైన్యం, పరిశ్రమలు, విద్యాసంస్థలు, స్టార్టప్‌లు, పరిశోధనా సంస్థల మధ్య సహకారాన్ని పెంచి ఆధునికీకరణను ముందుకు తీసుకెళ్తామని వివరించారు. మాజీ సైనికులు, వీరనారుల సంక్షేమానికి కూడా ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. దేశ భద్రత బలోపేతానికి యావత్ భారతదేశం ఏకతాటిపై నిలిచిందని అన్నారు.
సమగ్రతను కాపాడటంలో..
దేశ సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతను కాపాడటంలో పూర్తి నిబద్ధతతో పనిచేస్తానని జనరల్ సుబ్రమణి స్పష్టం చేశారు. భారత సైన్యం ఎప్పటికప్పుడు దేశ ప్రయోజనాలను పరిరక్షించిందని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర జవాన్లకు నివాళులు అర్పిస్తూ, వారి త్యాగాలు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అన్నారు. దేశ ప్రజలకు సేవ, ధైర్యం, గౌరవం అనే విలువలతో సాయుధ దళాలు తమ బాధ్యతలను కొనసాగిస్తాయని ఆయన భరోసా ఇచ్చారు. సీడీఎస్‌గా మూడు దళాలను ఒకే సమగ్ర కమాండ్ వ్యవస్థ కింద సమన్వయం చేయడం తన అత్యంత కీలక బాధ్యతగా అభివర్ణించారు.
నాలుగు దశాబ్దాలకుపైగా..
జనరల్ రాజా సుబ్రమణి నాలుగు దశాబ్దాలకుపైగా సేవలు అందించారు. వివిధ భౌగోళిక ప్రాంతాలు, క్లిష్ట పరిస్థితుల్లో ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు. 2024 జూలై 1 నుంచి 2025 జూలై 31 వరకు ఆర్మీ వైస్ చీఫ్‌గా పనిచేశారు. అంతకుముందు 2023 మార్చి నుంచి 2024 జూన్ వరకు సెంట్రల్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా సేవలందించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ), ఇండియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఏ)లో విద్యనభ్యసించిన ఆయన, 1985 డిసెంబర్ 14న గఢ్వాల్ రైఫిల్స్ 8వ బెటాలియన్‌లో కమిషన్ పొందారు.
కీలక బాధ్యతల్లో..
యూకేలోని జాయింట్ సర్వీసెస్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజ్, న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజ్‌లలో ఉన్నత శిక్షణ పొందిన జనరల్ సుబ్రమణి, లండన్‌లోని కింగ్స్ కాలేజ్ నుంచి ఎంఏ, చెన్నైలోని మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఫిల్ పట్టాలు పొందారు. అస్సాంలో నిర్వహించిన ‘ఆపరేషన్ రైనో’ సమయంలో 16 గఢ్వాల్ రైఫిల్స్‌కు కమాండ్ వహించారు. జమ్మూ కశ్మీర్‌లో 168 ఇన్ఫెంట్రీ బ్రిగేడ్, సెంట్రల్ సెక్టార్‌లో 17 మౌంటెన్ డివిజన్‌కు నాయకత్వం వహించారు. పశ్చిమ సరిహద్దులోని కీలక స్ట్రైక్ కార్ప్స్ సహా రెండు కార్ప్స్‌కు కమాండర్‌గా పనిచేశారు. అదనంగా కజకిస్తాన్‌లో డిఫెన్స్ అటాషేగా, మిలిటరీ ఇంటెలిజెన్స్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా, ఈస్టర్న్ కమాండ్‌లో బ్రిగేడియర్ జనరల్ స్టాఫ్ (ఆపరేషన్స్)గా, నార్తర్న్ కమాండ్ ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా సేవలందించారు. సైన్యానికి చేసిన విశిష్ట సేవలకు ఆయనకు పలు విశిష్ట సేవా మెడల్స్‌ను అందుకున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●US NRI Returning To India | NRIలు ఇండియాకు ఎందుకు తిరిగి రారు? ఈ నిజాలు తెలిస్తే షాక్!
- ●Bulandshahr Monkey Viral Video | వర్షంలా రాలిన రూ.500 నోట్లు.. లాయర్ బ్యాగ్ లాక్కొని చెట్టెక్కిన కోతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- ●Sridhar Vembu AI Bubble | 1999 డాట్-కామ్ క్రాష్ రిపీట్ కాబోతోందా? 'AI బబుల్'పై జోహో ఫౌండర్ శ్రీధర్ వేంబు స్ట్రాంగ్ వార్నింగ్
- ●Harish Rao | 'రైతు డిస్కం' వ్యవసాయానికి ఉరితాడు.. సోలార్ పవర్‌తో 24 గంటల కరెంట్ ఎలా ఇస్తారు? సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్
- ●Mallu Ravi | కేటీఆర్, హరీష్ రావులకు మతిస్థిమితం లేదు.. కూల్చేస్తాం, పేల్చేస్తాం అంటారా? ఎంపీ మల్లు రవి ఫైర్
- ●Kajal Aggarwal | పొట్టి డ్రెస్‌లో కాజల్ అందాల విందు

US NRI Returning To India | NRIలు ఇండియాకు ఎందుకు తిరిగి రారు? ఈ నిజాలు తెలిస్తే షాక్!

Bulandshahr Monkey Viral Video | వర్షంలా రాలిన రూ.500 నోట్లు.. లాయర్ బ్యాగ్ లాక్కొని చెట్టెక్కిన కోతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Sridhar Vembu AI Bubble | 1999 డాట్-కామ్ క్రాష్ రిపీట్ కాబోతోందా? 'AI బబుల్'పై జోహో ఫౌండర్ శ్రీధర్ వేంబు స్ట్రాంగ్ వార్నింగ్

Harish Rao | 'రైతు డిస్కం' వ్యవసాయానికి ఉరితాడు.. సోలార్ పవర్‌తో 24 గంటల కరెంట్ ఎలా ఇస్తారు? సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్






