త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gaganyaan | చివ‌రి ద‌శ‌కు గ‌గ‌న్‌యాన్ మిష‌న్‌.. మార్చిలో తొలి ప్ర‌యోగం చేప‌ట్ట‌నున్న ఇస్రో..!

Gaganyaan | భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ (ISRO) ప్ర‌తిష్టాత్మ‌క గ‌గ‌న్‌యాన్ మిష‌న్ కీల‌క ద‌శ‌కు చేరుకుంది. తొలి మాన‌వ‌ర‌హిత (అన్‌క్రూడ్) మిషన్ ‘జీ1’ను ఈ ఏడాది మార్చిలో ప్ర‌యోగించేందుకు వేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్న‌ది. వ్యోమ‌గాముల‌ను అంత‌రిక్షంలోకి పంపాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకోగా.. ఈ జీ1 మిష‌న్ కీల‌క మైలురాయిగా నిలువ‌బోతున్న‌ది.

P

National | Published On Jan 31, 2026, 6.37 pm IST

Gaganyaan | చివ‌రి ద‌శ‌కు గ‌గ‌న్‌యాన్ మిష‌న్‌.. మార్చిలో తొలి ప్ర‌యోగం చేప‌ట్ట‌నున్న ఇస్రో..!
Advertisement

Gaganyaan | భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ (ISRO) ప్ర‌తిష్టాత్మ‌క గ‌గ‌న్‌యాన్ మిష‌న్ కీల‌క ద‌శ‌కు చేరుకుంది. తొలి మాన‌వ‌ర‌హిత (అన్‌క్రూడ్) మిషన్ ‘జీ1’ను ఈ ఏడాది మార్చిలో ప్ర‌యోగించేందుకు వేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్న‌ది. వ్యోమ‌గాముల‌ను అంత‌రిక్షంలోకి పంపాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకోగా.. ఈ జీ1 మిష‌న్ కీల‌క మైలురాయిగా నిలువ‌బోతున్న‌ది. ఈ మిష‌న్ ప‌నులు ఇప్ప‌టికే 90శాతం పూర్త‌య్యాయ‌ని ఇస్రో తెలిపింది. 2024 డిసెంబర్ 18న శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ మార్క్-3 (LVM3) అసెంబ్లీని ప్రారంభించారు. ప్ర‌స్తుతం క్రూ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను విజయవంతంగా శాస్త్రవేత్త‌లు అనుసంధానించారు. క్రూ సురక్షితంగా భూమికి తిరిగివ‌చ్చేలా అవ‌స‌ర‌మైన ప్యారాచూట్ల‌ను సైతం ప‌రీక్షించిన విష‌యం తెలిసిందే. ఈ మిష‌న్‌లో వ్యోమ‌మిత్ర అనే రోబోను ఇస్రో నింగిలోకి పంప‌బోతున్న‌ది.

వ్యోమగాముల పరిస్థితులను అనుకరించేలా ఈ రోబో, లైఫ్ సపోర్ట్ వ్యవస్థల పనితీరుపై కీలక సమాచారాన్ని సేక‌రించ‌నున్న‌ది. గ‌గ‌న్‌యాన్ మిష‌న్ కోసం క్షేత్ర‌స్థాయిలో 8వేల‌కుపైగా ప్ర‌యోగాలు చేప‌ట్ట‌గా.. విజ‌య‌శాతం 97శాతంగా న‌మోదైంద‌ని ఇస్రో చైర్మ‌న్ నారాయ‌ణ‌న్ తెలిపారు. తెలిపారు. మొదటి ప్రయోగం మార్చిలో చేపట్టేందుకు కృషి చేస్తున్న‌ట్లుగా చెప్పారు. జీ1 మిషన్ ద్వారా లాంచ్ వెహికల్ పనితీరు, ఆర్బిటల్ మాడ్యూల్ కార్యకలాపాలు, రీ-ఎంట్రీ సాంకేతికత, క్రూ మాడ్యూల్ రికవరీ వ్యవస్థలను సమగ్రంగా పరీక్షించనున్నారు. అంతరిక్ష నౌకను 170×408 కిలోమీటర్ల కక్ష్యలో ప్రవేశపెట్టి, అనంతరం బంగాళాఖాతంలో సురక్షితంగా దించనున్నారు. జీ1 మిషన్‌లో భాగంగానే జీ2, జీ3 పేరుతో మ‌రో మానవ ర‌హిత మిష‌న్‌లో సైతం నిర్వ‌హించ‌నున్నారు. కొన‌సాగింపుగా 2027లో తొలి మాన‌వ హిత మిష‌న్ హెచ్‌1ని ప్ర‌యోగించ‌నున్నారు. ఈ మిష‌న్‌లో ముగ్గురు వ్యోమ‌గాములు ఏడు రోజుల పాటు లో ఎర్త్ ఆర్బిట్‌లో ప్ర‌యాణించి.. తిరిగి భూమిపైకి చేరుకోనున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement