త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Election Commission | 4 గంట‌ల‌కు సీఈసీ ప్రెస్ మీట్‌.. నాలుగు రాష్ట్రాల ఎన్నిక‌ల షెడ్యూల్‌!

Election Commission | నాలుగు రాష్ట్రాల, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు (Assembly Elections) ఆదివారం తెర‌లేవ‌నున్న‌ది. సాయంత్రం 4 గంట‌ల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం (Election Commission) మీడియా స‌మావేశం ఏర్పాటు చేసింది.

G

National | Published On Mar 15, 2026, 10.46 am IST

Election Commission | 4 గంట‌ల‌కు సీఈసీ ప్రెస్ మీట్‌.. నాలుగు రాష్ట్రాల ఎన్నిక‌ల షెడ్యూల్‌!
Advertisement

Election Commission | త్రినేత్ర‌.న్యూస్‌: నాలుగు రాష్ట్రాల, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు (Assembly Elections) ఆదివారం తెర‌లేవ‌నున్న‌ది. సాయంత్రం 4 గంట‌ల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం (Election Commission) మీడియా స‌మావేశం ఏర్పాటు చేసింది. ఈ సంద‌ర్భంగా త‌మిళ‌నాడు, ప‌శ్చిమ‌బెంగాల్‌, కేర‌ళ‌, అస్సాం, పుదుచ్చేరి శాస‌నస‌భ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలుస్తుంది. వెంట‌నే ఆయా రాష్ట్రాల్లో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి రానుంది.

ఎన్నిక‌ల షెడ్యూల్‌తోపాటు నోటిఫికేష‌న్ వెలువ‌డే తేదీల‌ను కేంద్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్ కుమార్‌, ఎలెక్ష‌న్ క‌మిష‌న‌ర్లు డాక్ట‌ర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు, డాక్ట‌ర్ వివేక్ జోషి ప్ర‌క‌టించ‌నున్నారు. ఈ ఎన్నిక‌లు ఏప్రిల్, మే నెల‌ల్లో జ‌రిగే అవ‌కాశం ఉంది. కాగా, నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర‌పాలిత ప్రాంతంలో మే, జూన్ నెల‌ల్లో వేర్వేరు తేదీల్లో అసెంబ్లీల గ‌డువు ముగియ‌నుంది. ఈ రాష్ట్రాల్లో ఇప్ప‌టికే ఓట‌ర్ల జాబితా ప్ర‌త్యేక స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ (SIR) ప్ర‌క్రియ ముగిసింది. తుది ఓట‌ర్ల జాబితాను ప్ర‌చురించారు.

ప‌శ్చిమబెంగాల్ 17వ అసెంబ్లీ గ‌డువు మే 7న ముగియ‌నుంది. 294 ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీకి మార్చి చివ‌ర‌లో లేదా ఏప్రిల్ మొద‌టి వారంలో ఎన్నిక‌లు నిర్వ‌హించే అవ‌కాశం ఉంది. దీంతో మే 7వ తేదీకి ముందు నూత‌న అసెంబ్లీ కొలువుదీర‌నుంది.

Advertisement
Advertisement