Election Commission | బెంగాల్, తమిళనాడులో 48 గంటలు డ్రై డే.. ఎన్నికల సంఘం ప్రకటన
Election Commission | స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్, తమిళనాడులో 48 గంటల పాటు డ్రై డే అమలు చేయాలని సోమవారం ఆదేశించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
Election Commission | స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్, తమిళనాడులో 48 గంటల పాటు డ్రై డే అమలు చేయాలని సోమవారం ఆదేశించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. పోలింగ్ ముగియడానికి ముందు 48 గంటల వ్యవధిలో పోలింగ్ ప్రాంతాల్లో మద్యం విక్రయం, సరఫరా, పంపిణీ పూర్తిగా నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది. హోటల్స్, రెస్టారెంట్లు, క్లబ్స్, మద్యం దుకాణాలు సహా అన్ని ప్రదేశాల్లో ఈ నిషేధం అమలులో ఉంటుందని పేర్కొంది. స్టార్ హోటల్స్, ప్రైవేట్ క్లబ్స్, రెస్టారెంట్లు వంటి లైసెన్స్ ఉన్న సంస్థల్లోనూ ఈ సమయంలో మద్యం విక్రయాలకు అనుమతి ఉండదని స్పష్టం చేసింది.
పోలింగ్ జరిగే ప్రతి దశలోనూ, అలాగే అవసరమైతే జరిగే రీపోలింగ్ సమయంలోనూ ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. మే 4న జరిగే ఓట్ల లెక్కింపు రోజున కూడా దేశవ్యాప్తంగా ఇలాంటి ఆంక్షలు అమల్లో ఉంటాయని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ సమయంలో లైసెన్స్ లేకుండా మద్యం నిల్వ చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. ఇదిలా ఉండగా.. తమిళనాడులో ఈ నెల 23న పోలింగ్ జరుగనుండగా.. పశ్చిమ బెంగాల్‌లో 23, 29 తేదీల్లో పోలింగ్ జరుగనుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మే 4న ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఓటర్లపై అనవసర ప్రభావం లేకుండా చూసేందుకు, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం వివరించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vijay TVK cabinet 2026 | సీఎం విజయ్ ‘క్యాబినెట్ ఆఫ్ ఫస్ట్స్’: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం.. దళపతి మాస్టర్ మైండ్
మే 21, 2026

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

SIR | అర్హులకు ఓటు హక్కు కల్పించడమే సర్ లక్ష్యం : కలెక్టర్ గరిమ అగ్రవాల్
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



