Lok Sabha | లోక్‌సభలో మరోసారి గందరగోళం.. 8 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన స్పీకర్
Lok Sabha | లోక్‌సభ (Lok Sabha)లో వరుసగా రెండో రోజూ గందరగోళం నెలకొంది. స్పీకర్ ఓం బిర్లాపై విపక్ష సభ్యులు కాగితాలు చించి విసిరారు (throwing papers).
Lok Sabha | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా కొనసాగుతున్నాయి. సభలో అధికారపక్షం, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ (Lok Sabha)లో వరుసగా రెండో రోజూ గందరగోళం నెలకొంది. స్పీకర్ ఓం బిర్లాపై విపక్ష సభ్యులు కాగితాలు చించి విసిరారు (throwing papers). దీంతో రగడ మొదలైంది. ఫలితంగా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలను స్పీకర్ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు (Eight opposition MPs suspended).
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) వరుసగా రెండో రోజూ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవేణా రాసిన ప్రచురించని పుస్తకంలోని కొన్ని వివరాలను లోక్‌సభలో ప్రస్తావించేందుకు యత్నించారు. దీంతో రాహుల్‌ని అధికార పార్టీ ఎంపీలు అడ్డుకున్నారు. దీంతో సభలో గందరగోళం మొదలైంది. అధికారపక్షం తీరుకు నిరసనగా కాంగ్రెస్ ఎంపీలు నిరసనకు దిగారు. పేపర్లు చించి స్పీకర్ ఓంబిర్లాపై విసిరేశారు. ఆగ్రహించిన స్పీకర్.. ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలను సభనుంచి సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు.
సస్పెండైన వారిలో హిబీ ఈడెన్, అమరీందర్ సింగ్, రాజా వారింగ్, మాణికం ఠాగూర్, గుర్జీత్ సింగ్, కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. వీరి తీరుని స్పీకర్ ఖండించారు. ఇది పార్లమెంటరీ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. అనంతరం విపక్ష సభ్యుల నిరసనల మధ్యే సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. మరోవైపు ఎంపీలను స్పెండ్ చేయడంపై రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు తీవ్రంగా వ్యతిరేకించారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






