త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pakisthan | పాక్‌ సరిహద్దుల్లో డ్రగ్స్ క‌ల‌క‌లం.. డ్రోన్‌తో జారవిడిచినట్లు అనుమానాలు

Pakisthan కుక్క తోక‌ర వంక‌ర‌న్న‌ట్లు పాక్ (Pak) బుద్ధి మార‌డం లేదు. త‌ర‌చూ ఏదో ఓ విధంగా క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతూనే ఉంది. తాజాగా పాక్ స‌రిహ‌ద్దు వెంబ‌డి భారీగా మాద‌క ద్ర‌వ్యాలు (Drugs) ల‌భించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

S

National | Published On Feb 14, 2026, 3.55 pm IST

Pakisthan | పాక్‌ సరిహద్దుల్లో డ్రగ్స్ క‌ల‌క‌లం.. డ్రోన్‌తో జారవిడిచినట్లు అనుమానాలు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: కుక్క తోక‌ర వంక‌ర‌న్న‌ట్లు పాక్ బుద్ధి మార‌డం లేదు. త‌ర‌చూ ఏదో ఓ విధంగా క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతూనే ఉంది. తాజాగా పాక్ స‌రిహ‌ద్దు వెంబ‌డి భారీగా మాద‌క ద్ర‌వ్యాలు (Drugs) ల‌భించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. జమ్మూకశ్మీర్ (Jammukashmir) లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారీగా మాదక ద్రవ్యాలు లభించడం కలకలం సృష్టిస్తోంది. పాకిస్థాన్‌ (Pakisthan) నుంచి వచ్చిన డ్రోన్‌ (Drone) వాటిని జారవిడిచినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఆర్‌ఎస్‌ పురా సెక్టార్‌లో 6.5 కిలోలకు పైగా హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోవ‌డంతో స్థానికుల అనుమానాలు నిజమేన‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

రూ.40 కోట్ల హెరాయిన్‌..

శుక్రవారం అర్థరాత్రి అనుమానిత డ్రోన్‌ (Drone) కదలికలను స్థానికులు గుర్తించారు. ఆ డ్రోన్‌ ఏదో పదార్థాన్ని జారవిడిచినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంట‌నే పోలీసులు, బీఎస్‌ఎఫ్‌ దళాలతో కలిసి ఆ ప్రాంతంలో తనిఖీలు చేప‌ట్టారు. స్థానిక పొలాల్లో పెద్దఎత్తున హెరాయిన్ (Heroin) ను గుర్తించారు. దాని మొత్తం విలువ రూ.40 కోట్లకు పైగా ఉంటుందని వారు భావిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇద్ద‌రి అరెస్టు..

మ‌రోవైపు కథువా (Kathuva) జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్‌ల ద్వారా పాక్‌ నుంచి హెరాయిన్‌ను అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలపై ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని పంజాబ్‌ (Punjab) లోని పఠాన్‌కోట్‌కు చెందిన జతిన్‌, కథువాలోని జఖ్‌బార్‌కు చెందిన డానిష్‌ డోగ్రాలుగా గుర్తించారు. ఈ ఇద్ద‌రికీ పాకిస్థాన్‌కు చెందిన స్మగ్లర్‌లతో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Advertisement
Advertisement