DK Shivakumar | సగం కొరికిన యాపిల్స్‌ను జనంపైకి విసిరిన సీఎం డీకే శివకుమార్.. నెట్టింట దుమారం
DK Shivakumar | కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) డీకే శివకుమార్ (DK Shivakumar) వివాదంలో చిక్కుకున్నారు. తన సొంత నియోజకవర్గమైన కనకపుర (Kanakapura) పర్యటన సందర్భంగా సగం కొరికిన యాపిల్ పండ్లను జనంపైకి విసిరారు. ఇందుకు సంబంధించిన వీడియో తీవ్ర దుమారం రేపుతోంది.
DK Shivakumar | కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) డీకే శివకుమార్ (DK Shivakumar)కు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అందులో ఆయన యాపిల్ పండ్ల (Apples)ను ఓ బైట్ కొరికి ఆ తర్వాత వాటిని జనంపైకి విసిరారు. ఈ వీడియో నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డీకే తన సొంత నియోజకవర్గమైన కనకపురకు (Kanakapura) వెళ్లారు. అక్కడ హారహళ్లి ప్రాంతంలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా డీకేకి స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. వందలాది తాజా యాపిల్ పండ్లు, పూలతో తయారు చేసిన ఓ భారీ గజమాలను క్రేన్ సాయంతో డీకేకి బహూకరించారు. ఆ తర్వాత ఆ మాలలోని రెండు యాపిల్ పండ్లను తీసుకుని డీకే ఓ బైట్ కొరికారు. ఆ తర్వాత వాటిని కార్యకర్తలపై విసిరేశారు. అక్కడున్న కొందరు ఆ ఎంగిలి పండును మహాప్రసాదంగా భావించి దాన్ని చేజిక్కించుకునేందుకు ఎగబడటం గమనార్హం.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు డీకేని సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంగిలి యాపిల్‌ను జనంపైకి విసరడం ఏంటి..? అంటూ ప్రశ్నిస్తున్నారు. ‘‘ఇది ప్రజాస్వామ్యం కాదు. రాచరికపు పోకడ..’’ అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు.
#Karnataka CM DK Shivakumar grabbed attention during a grand welcome in Harohalli, Kanakapura, when he plucked an apple from a massive apple garland, took a bite, and tossed the remaining fruit into the cheering crowd. pic.twitter.com/TThAPpDUJF
— Imran Khan (@KeypadGuerilla) June 9, 2026
Also Read..
కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ కుమార్తెకు ఈడీ సమన్లు
హర్మూజ్ సమీపంలో కూలిన యూఎస్ అపాచీ హెలికాప్టర్
డీకేకి తగ్గని తలనొప్పి.. శాఖల కేటాయింపులపై కొనసాగుతున్న మంత్రుల అలక.. ఢిల్లీకి క్యూ
సంబంధిత వార్తలు

DK Shivakumar | డీకేకి తగ్గని తలనొప్పి.. శాఖల కేటాయింపులపై కొనసాగుతున్న మంత్రుల అలక.. ఢిల్లీకి క్యూ
జూన్ 9, 2026

DK Shivakumar | అవును మాటిచ్చా.. కానీ, హైకమాండ్‌దే తుది నిర్ణయం.. రామలింగారెడ్డి రాజీనామాపై డీకే రెస్పాన్స్..
జూన్ 5, 2026

DK Shivakumar | డీకే కేబినెట్లో కొత్త ట్విస్ట్.. ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే మంత్రి రాజీనామా
జూన్ 5, 2026
తాజావార్తలు
- ●Nara Lokesh | విశాఖ స్టీల్ ప్రమాదం.. మంత్రి లోకేష్ తీరుపై కార్మిక సంఘాల గుర్రు
- ●SpaceX IPO | ఎలాన్ మస్క్ 'స్పేస్ఎక్స్' ఐపీవో వచ్చేస్తోంది.. భారతీయులు ఇందులో ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు?
- ●Great Nicobar airport | తీవ్ర వివాదం వేళ కేంద్రం కీలక నిర్ణయం.. రూ.13 వేల కోట్లతో గ్రేట్ నికోబార్ ఎయిర్‌పోర్టుకు క్లియరెన్స్
- ●ACB Raids | ఆదాయానికి మించి ఆస్తులు.. ఆర్ అండ్ బీ ఈఎన్సీ మోహన్‌నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు
- ●Bharat Pe | బ్యాంకు ఖాతాలో డబ్బు లేకున్నా యూపీఐ ద్వారా చెల్లింపులు.. భారత్‌పే ఫ్లెక్స్‌తో కొత్త సౌకర్యం..
- ●Kajal Aggarwal | నయనతార ఛాన్స్ కొట్టేసిన కాజల్ - భగవంత్ కేసరి కాంబో రిపీట్

Nara Lokesh | విశాఖ స్టీల్ ప్రమాదం.. మంత్రి లోకేష్ తీరుపై కార్మిక సంఘాల గుర్రు

SpaceX IPO | ఎలాన్ మస్క్ 'స్పేస్ఎక్స్' ఐపీవో వచ్చేస్తోంది.. భారతీయులు ఇందులో ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు?

Great Nicobar airport | తీవ్ర వివాదం వేళ కేంద్రం కీలక నిర్ణయం.. రూ.13 వేల కోట్లతో గ్రేట్ నికోబార్ ఎయిర్‌పోర్టుకు క్లియరెన్స్

ACB Raids | ఆదాయానికి మించి ఆస్తులు.. ఆర్ అండ్ బీ ఈఎన్సీ మోహన్‌నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు



